Nara Lokesh Yuvagalam : నారా లోకేష్ యువగళం…… టీడీపీ పరిస్థితి గందరగోళం..!!
నారా లోకేష్ పాదయాత్ర 25 రోజులు పూర్తయింది. యాత్ర మొదలై ఇన్ని రోజులైనా ప్రజల నుండి స్పందన లేదు. లోకేష్ పాదయాత్ర వైఫల్యానికి ప్రధాన కారణం ఏంటో ఒకసారి చూద్దాం..
ఏపీ రాజకీయాల్లో పాదయాత్రకి ఉన్న చరిత్ర అంతా ఇంతా కాదు.. ఏకంగా ప్రభుత్వాలనే మార్చగలిగే అంశాల్లో పాదయాత్ర కీలకం అవుతూ వస్తుంది.2004 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి, అలాగే YS రాజశేఖర్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి కావడానికి పాదయాత్ర బ్రహ్మాస్త్రం అయింది.
అలాగే ఆ తరువాతి కాలంలో 2014 లో చంద్రబాబు మొదలుకొని మొన్న 2019 లో జగన్ మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అవడంలో ఈ పాదయాత్ర నే అత్యంత కీలకం అయ్యాయి అనడంలో ఆశ్చర్యం లేదు.
ఇప్పుడు తాజాగా టిడిపి యువనేత లోకేష్ కూడా యువగలం పేరుతో దాదాపు 4000 కి. మీ పాదయాత్రకి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
అప్పట్లో వైయస్సార్ మొదలుకొని చంద్రబాబు, ఆ తరువాత జగన్ పాదయాత్రకి జనాల స్పందన ఓ రేంజ్ లో సాగింది. దాని ఫలితమే ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో వారు గెలిచి ముఖ్యమంత్రులుగా కూడా అయ్యారు.
లోకేష్ పాదయాత్రకు రాని జనం.. లోపం ఎక్కడ..?
లోకేష్ పాదయాత్ర కి ఎందుకు రావట్లేదు జనాలు??లోపం ఎక్కడ ఉంది అనేది ఒకసారి చూస్తే.. సాధారణంగా పాదయాత్ర ఒక ఊరికి గానీ ఒక పట్టణానికి గానీ చేరుకుంది అంటే.. ఆ ఊరికి సంభందించిన సమస్యలు లేదా ఆ పట్టణం కానీ జిల్లాకి కానీ, లేదా అక్కడ ఏ ఏ కులాల వారు ఉంటారు వారి జీవన స్థితిగతులు ఏంటి అని పలురకాల సమస్యలకు సంబందించిన అంశాలపై మాట్లాడటం ఉంటుంది. అప్పుడే వింటున్న జనానికి ఆ నాయకుడి మీద భరోసా ఉంటుంది. లోకేష్ మాటల్లో అది లోపించింది. తన ప్రసంగం మొత్తం సియం ని తిట్టడానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారానేది ప్రధాన అభిప్రాయం గా వ్యక్తం అవుతుంది. పైగా పాదయాత్ర లో స్థానిక సమస్యలపై పెద్దగా అవగాహన లేకపోవడం తో పాటు తన ప్రసంగం కొనసాగించడం. అలాగే వివిధ వర్గాల వారికి, నిరుద్యోగులకి, మహిళలకి, కులవృత్తుల వారికి , కార్మికులకు ఇలా కొన్ని వర్గాల వారికి భరోసా కల్పిస్తాం అన్నట్లు కనీసం హామీ ఇవ్వకపోవడం. పైగా చెప్పే మాటల్లో అర్ధం అయ్యే ప్రసంగాలు లేకపోవడం. ఆఖరికి ప్రభుత్వం పట్ల వ్యతిరేఖ భావం ఉన్నవారిని తమ ప్రభుత్వం వస్తే ఏ రకంగా మేలు చేస్తాం అన్న విషయం కూడా లోకేష్ చెప్పలేకపోవడం ప్రధాన లోపం.
కనీసం ఒక ప్రతిపక్ష నాయకుడిగా “మేము అధికారంలోకి వస్తే అభివృద్ధి ఏ రకంగా చేస్తాం.. నిరుద్యోగులకి ఉద్యోగాలు కావొచ్చు లేదా వివిధ వర్గాలవారిని ఇలా ఆదుకుంటాం అని కనీసం చెప్పకపోవడం మానేసి, ఎవరో పదిమంది చప్పట్లు కొడితే చాలు అనుకున్నట్లు మిమ్మల్ని వదిలిపెట్టం మీ సంగతి తేలుస్తాం అనడం కూడా ఎక్కువమంది జనాలకి రుచించట్లేదు..
ప్రజల మన్ననలు పొంది, వారిచేత భరోసా అందుకొని, వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకోవాలి అంటే ముందు మనం ఏం చేస్తాం, చేయబోయేది అన్నదే ప్రజలకి కావాల్సింది..అంతేకానీ పదిమంది చప్పట్లు కొట్టేవారి కోసం వ్యక్తిగత దూషణలు చేయడం వల్లే లోకేష్ పాదయాత్రకి జనాల స్పందన లేదంటున్నారు విశ్లేషకులు.
ఇప్పటికైనా పాదయాత్ర లో అనుసరిస్తున్న విధానాలు మార్చుకొని వ్యక్తిగత దూషణలు చేయకుండా.. అధికారం లోకి వస్తే తానేం చేస్తాడో అని చెప్పి ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తే గానీ టీడీపీ కి పార్టీ పరంగా పెద్దగా ఉపయోగం లేకపోగా ఎదురు పార్టీకి నష్టం కలిగిస్తుంది.