Parliament elections Sonia Gandhi is Contesting From Telangana : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సాధించిన కాంగ్రెస్ పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి, బీఆర్ఎస్, బిజెపిల కంటే జనాలు కాంగ్రెస్ ని నమ్ముతున్నారు. మెజారిటీ స్థానాలు దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల వైపు దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికను కూడా ఆలోచిస్తుంది. కొంతమంది అభ్యర్థులను ఫైనల్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది.
అయితే దీంట్లో ముఖ్యంగా కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీని కూడా తెలంగాణ నుంచి పోటీ చేయించాలని ఆలోచనలతో కాంగ్రెస్ నాయకులు ఉన్నట్లు సమాచారం. టిపిసిసి కూడా తీర్మానం చేసిందని తెలుస్తుంది. తెలంగాణ నుంచి సోనియా గాంధీ ఎంపీగా పోటీ చేయిస్తే ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందనేది, అన్ని స్థానాల్లోనూ గెలిచే అవకాశం కూడా ఉంటుందని కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో మాత్రమే కాకుండా దక్షిణాది రాష్ట్రాల పైన కూడా ఆ ప్రభావం కనిపిస్తుందని వారి అంచనా.
తెలంగాణ నుంచి సోనియాగాంధీని పోటీ చేయించేందుకు నాలుగు నియోజకవర్గాలను పరిశీలిస్తున్నారంట. ఇప్పుడు ఈ చర్చ చాలా ఆసక్తిగా సాగుతుంది. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరి నుంచి సోనియాను పోటీ చేయించాలని ఆలోచనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2019 ఎన్నికల్లో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నారు.
సోనియా గాంధీని కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా విజయం దక్కుతుందని వాళ్ళు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకోరకంగా మెదక్ నియోజకవర్గాన్ని కూడా ఆలోచిస్తున్నారంట. గతంలో ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు.ఈ నియోజకవర్గ పై సోనియా ఆసక్తి చూపిస్తున్నారని కూడా సమాచారం. అప్పట్లో మెదక్ లో ప్రచారం చేయకపోయినా ఇందిరాగాంధీ అక్కడి నుండి పదిమంది బలమైన నేతలను ఓడించి గెలుపును సొంతం చేసుకున్నారు.
రెండు లక్షల మెజారిటీని దక్కించుకున్నరూ. ఇక మూడో ఆప్షన్ గా కరీంనగర్ ని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ ఏర్పాటుపై మొదటిసారి సోనియా కరీంనగర్ నుంచి మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు సోనియా గాంధీకి జనాలలో సానుకూలత ఉంది. కరీంనగర్ నుంచి పోటీ చేయించిన సోనియా గాంధీ సులువుగా గెలుస్తారని ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఇక నాలుగో ఆప్షన్ గా చేవెళ్ల నియోజకవర్గం పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా ఉంది. సెంటిమెంటు వర్కౌట్ అవుతుందని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి సోనియా ఇక్కడ నుంచి పోటీ చేసే ఆలోచనతోనే రేవంత్ రెడ్డి ఇన్చార్జిగా నియమించాలని ప్రచారం కూడా పార్టీలో జరుగుతుంది.