Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్రలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చాలామంది ప్రజలు తమ సమస్యలతో, వారి గోడును వెళ్ళబుచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసమే పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన ఈ జనవాణిలో, వారు చెప్పే ప్రతి ఒక్క సమస్యను ఆయన ఎంతో ఓపికగా విని, వారి
సమస్యలకు తప్పకుండా పరిష్కార మార్గాన్ని చూపిస్తామని భరోసా ఇచ్చారు. అకాల వర్షాలు వచ్చి ప్రజలందరూ అల్లకల్లోలమై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ, రైతులు పంట నష్టపోయినప్పటికి ప్రభుత్వంలో ఎటువంటి చలనం కనిపించలేదు. తుఫాన్ సమయంలో కనీసం షెల్టర్లు లేవు, ఇళ్లు ధ్వంసం అయితే కనీసం ప్రభుత్వం కట్టించలేదు,
తుఫాన్ బాధితులను పట్టించుకోవడం లేదు అని పవన్ కళ్యాణ్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. 4 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్న గ్రామంలో, కనీసం స్మశాన వాటిక లేకపోవడం దురదృష్టకరం అని పవన్ కళ్యాణ్ పేర్కోన్నారు. ఈ ఒక్క సమస్యనే కాదని, ప్రతి ఒక్కరూ ఒక్కో సమస్యతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని.
ఏ ఒక్కరి సమస్యను కూడా ఈ అసమర్ధ ప్రభుత్వం తీర్చలేక పోతుందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. రాబోయే కాలంలో జనసేన అధికారంలోకి వచ్చేలాగా ప్రజలు తమ వంతు సహాయ, సహకారాలు అందించాలని, జనసేన అధికారంలోకి రాగానే ప్రతి ఒక్క సమస్యను పట్టించుకోని ప్రజల మధ్యనే ఉంటామని ఆయన ప్రజలందరికీ భరోసా ఇచ్చారు.