Pawan Kalyan : చేగువేరా జయంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆయనకి విప్లవ జోహార్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ కి చేగువేరా అంటే మొదటి నుంచి ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. నేటి యువత చేగువేర ఆశయాలను స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని పవన్ కళ్యాణ్ చెబుతూ ఉంటారు. ఆ విప్లవ వీరుని గురించి ఆయన చేపట్టిన పోరాటం గురించి ఎక్కడ ఏ చిన్న అవకాశాన్ని కూడా పవన్ కళ్యాణ్ వదలకుండా చేగువేరా మీద ఉన్న తన అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు.
విప్లవ తార చేగువేరా బానిస సంకెళ్లను తెంచే ఆలోచనలకు భౌగోళిక హద్దులుండవు.. విశ్వ మానవుడిగా నీవు మారితే సమస్త మానవాళి ఆక్రందనలు నీకు వినిపిస్తాయి అంటారు క్యూబా విప్లవ యోధుడు చేగువేరా, అర్జెంటీనా దేశంలో పుట్టి, క్యూబా దేశంలో బానిసత్వపు నీడలో మగ్గిపోతున్న పీడిత ప్రజల పక్షాన గెరిల్లా పోరాటం చేసి, తుదకు బొలీవియా పోరాటంలో వీర మరణం పొందిన చేగువేరా స్పూర్తి సదా స్ఫూర్తిదాయకం అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
ఆయనలోని యోధుడిని నేను ప్రత్యేకంగా అభిమానిస్తాను. చేగువేరా జయంతి అయిన నేడు, జనసేన వారాహి విజయ యాత్రను మొదలుపెట్టడం యాధృచికం. ప్రజా పోరాటాల్లో జనసేన పార్టీకు ఆ విప్లవ యోధుడి తెగువే స్ఫూర్తి. జయంతి సందర్భంగా చేగువేరాకు నా తరఫున, జనసేన పార్టీ పక్షాన విప్లవ నివాళులర్పిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు.