Pawan Kalyan : ప్రస్తుతం జనసేన పార్టీ కార్యకలాపాలన్నీ హైదరాబాద్ నుంచి జరుగుతున్నాయి. కొత్త పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ భూమి పూజ చేశారు..జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి మంగళగిరిలో సోమవారం ఉదయం భూమి పూజ జరిగింది. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొని పూజాదికాలు నిర్వహించారు. భూమాత ప్రత్యర్ధం నిర్వర్తించాల్సిన కార్యక్రమాలను వేద పండితుల పర్యవేక్షణలో ఆయన చేపట్టారు.
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ కార్యకలాపాలన్నీ ఇప్పటి వరకూ హైదరాబాద్ నుండే సాగుతున్నాయి. కానీ ఆంధ్రాలోనే పార్టీ కార్యాలయాన్ని స్థాపించాలని పవన్ కళ్యాణ్ ఎప్పుడో నిర్ణయించుకున్నారు. దానిని ఇప్పుడు అమలుచేశారు. ప్రజలకు నిత్యం దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కార్యాలయం మంగళగిరిలో ఉంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా తమ సమస్యలు తెలుసుకోవడానికి సునాయాసంగా ఉంటుందని ఆయన ఈ నిర్మాణాన్ని చేపట్టారు.
ఇకపై మంగళగిరి నుంచే పార్టీ కేంద్ర వ్యవహారాలు కొనసాగించాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అందులో భాగంగానే కేంద్ర కార్యాలయ భవనానికి భూమి పూజ చేసారు. కార్యాలయ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ నిపుణులకు పవన్ కళ్యాణ్ సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు. ఓ వైపు భూమి పూజ, మరో వైపు యాగ నిర్వహణతో ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకొంది.