Pawan Kalyan : ‘నేను, నా దేశం.. ఈ రెండింటిలో నా దేశమే అత్యంత ముఖ్యమైనది’ ఇంత మంచి మాటలు బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నా గొప్పగా ఎవరు చెప్పలేరు అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ…
రాజ్యాంగాన్ని మనకు అందించి ,దాని ద్వారా సమస్త భరత జాతి సమానమే అని చెప్పిన అంబెడ్కర్ ని తలుచుకుంటూ..ఈ దేశం సమైక్యంగా..ముందుకు నడవాలి అంటే మనం అందరం అంబెడ్కర్ ఆశయాలను అనుసరించాలి అని, ఆయన మనకోసం ఎన్నో అవమానాలను,ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడ్డ ఒక మహోన్నత వ్యక్తి అని అంబెడ్కర్ కీర్తిని కొనియాడారు పవన్ కళ్యాణ్.
‘భారత రత్న’గా ప్రకాశిస్తున్నా అంబెడ్కర్ ఆశయ సాధనలోనే, ఆ మహానుభావుని మూలసూత్రాల ఆధారంగానే జనసేన ప్రస్థానం సాగుతుందని,ఆ వైపుగా ప్రమాణం చేస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.అంబెడ్కర్ చెప్పినట్టుగా ‘నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు.. అదే జనం కోసం జీవిస్తే జనంలో నిలిచిపోతావు’ అనే మాటలను మననం చేసుకుంటూ,
ఆ ఆదర్శమూర్తి అడుగుజాడల్లోనే నేను ఎప్పటికి నడుస్తానని ఈ సందర్భంగా నేను ఆయనకు వినమ్రంగా నివాళులు అర్పిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ చెప్పారూ. అంబేద్కర్ వంటి మహా జ్ఞాని గురించి చాల విషయాలు నేను తెలుసుకున్నాను. ఆయన ఒక జ్ఞాన నిధి. ఆయన లాంటి వాళ్ళు ఉండడం చాలా అరుదు.
అంబెడ్కర్ గురించి మరింత అధ్యయనం చేయడం కోసం నేను లండన్ లో ఆయన నివాసం ఉండి, ఇప్పుడు స్మారక మందిరంగా రూపుదిద్దుకున్న గృహాన్ని సందర్శించానని చెప్పారు. అలాగే లక్నోలో విశీష్ఠంగా నిర్మితమైన ఆయన స్మారక మందిరాన్ని చూశానని, ఆయన గురించి చాలా విషయాలు తెలుసుకున్నానని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
బాబాసాహెబ్ అంబేడ్కర్ ఒక గొప్ప విద్యావేత్త, మేధావి ,న్యాయకోవిదుడు, పాత్రికేయుడు,రాజకీయ నాయకుని, రాజ్యాంగ నిర్మాణ సారధి ,న్యాయశాఖ మంత్రిగా ఆయన ఈ దేశానికీ చేసిన సేవలు వెలకట్టలేనివి అని పవన్ ప్రశంసించారు.అంబెడ్కర్ విమర్శలకు అస్సలు వెరవని వాడని ‘ఏ కారణం లేకుండా తనపై విమర్శలు వస్తున్నాయంటే.. నువ్వు విజయం సాధించబోతున్నావని అర్థం అని,
“మేకల్ని బలి ఇస్తారు, కానీ పులులను బలి ఇవ్వరు, కాబట్టి పులుల్లా బతకండి” అని అణగారిన వర్గాలలో ధైర్యం నింపాలని . అస్పృశ్యత, అంటరానితం నిర్మూలనకు తన జీవిత చరమాంకం వరకు ఎనలేని కృషి చేసి అసామాన్యునిగా నిలిచారని పవన్ ప్రశంసిస్తూ.. అంబేద్కర్ కి ఘన నివాళి అర్పించారు.