Telangana MLA Elections:ఈసారి తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే… ఒంటరిగానే వస్తాం అంటున్న రేవంత్
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణా లో ఈసారి కాంగ్రెస్ జెండా తప్పక ఎగురవేస్తాం అని TPCC చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.ఈసారి ఎన్నికల్లో సింగిల్ గా కాంగ్రెస్ కి 75 అసెంబ్లీ సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. BRS పాలన పట్ల తెలంగాణా ప్రజలు తీవ్ర ఆగ్రహం తో ఉన్నారని, కేవలం 25 కి మించి సీట్లు రావని అన్నారు.కాంగ్రెస్ చేపడుతున్న పాదయాత్రకి ప్రజల నుండి అపూర్వ మద్దతు వస్తుంది అన్నారు.
అయితే రాష్ట్రంలో ఏ పార్టీ గెలవాలన్నా 80 లక్షల ఓట్లు అవసరం అని రేవంత్ అంచనా వేశారు.70 నుండి 80 లక్షల ఓట్లు సాధిస్తేనే విజయం వరిస్తుందని, అందుకు అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్తున్నామని చెప్పారు.BRS, BJP పార్టీలు ఎప్పుడూ దొందూ దొందే అని విమర్శలు గుప్పించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ సదా సిద్ధంగా ఉందని తెలిపారు.