Telangana Next CM : తెలంగాణలో సీఎం కేసీఆర్ తరువాత ఆయన వారసుడిగా కేటిఆర్ బాధ్యతలు చేపడతారని, రాష్ట్రంలో బిఆర్ఎస్ ను నడిపించేది కేటీఆర్ అని, గత కొన్నాళ్లుగా వార్తాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించకున్న, అతి త్వరలో జరగబోయేది ఇదే అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఏడాది చివర్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే మాత్రం.. కేటీఆర్ సీఎం పీఠం ఎక్కనున్నారు అనేది అందరి ఊహాగానాలు. అయితే ఈ విషయాన్ని కేసీఆర్ గాని బిఆర్ఎస్ పార్టీ నాయకులు గాని ఖండించక పోవడం గమనార్హం. బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత అంతా ప్రతిభ కనపరిచే నాయకుడు కేటీఆర్ మాత్రమేనని అందరి అభిప్రాయం. ఇప్పటికే కేటీఆర్ ఐటి మంత్రిగా తన సత్తా చాటుతున్నారు.
కేటీఆర్ కూడా తండ్రి కి తగ్గ తనయుడిగా తెలంగాణ రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ, తన ప్రతిభను కనపరుస్తున్నాడు. తనకు అంటూ ఒక ప్రత్యేకత తెలంగాణలో తెచ్చుకున్నాడు. తెలంగాణలో సరైన ప్రతిపక్షం లేదు. బిఆర్ఎస్ గెలిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్టే.. కేటీఆర్ సీఎం అయితే రాష్ట్ర రాజకీయాలు కొత్త మలుపు తిరగడం మాత్రం ఖాయం.