TSPSC Paper Leak Case : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ Tspsc లో ఒక్కో లీకేజీ బయటపడుతున్నాయి. ప్రవీణ్ కి సన్నిహితంగా ఉండే ప్రభుత్వ హిందీ ఉపాధ్యాయురాలు రాథోడ్ రేణుక కోసమే ఇదంతా చేసినట్టు బయటపడింది. హనీ ట్రాప్ లో చిక్కుకున్న ప్రవీణ్, రేణుక చెప్పిందల్లా చేసినట్టు తెలుస్తుంది. మొదట టౌన్ ప్లానింగ్ పేపర్ లీక్ అయిందని అనుమానంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసారు.
తరువాత ఈ కేసు సిట్ అధికారుల చేతిలోకి వెళ్ళింది. కేసును ముమ్మరంగా దర్యాప్తు చేసిన సిట్ అధికారులు సంచలన విషయాలు బయటపెట్టారు. ఏఈ పేపర్ కూడా లీకైనట్లు సిట్ దర్యాప్తులో తేలింది. మూడు ప్రశ్న పత్రాలు ప్రవీణ్ పెన్ డ్రైవ్ లో ఉన్నట్లు సిట్ అధికారులు కనుగొన్నారు. TSPSC నుండి మొత్తం ఐదు పేపర్లు లీకైనట్లు సిట్ తెలిపింది. ప్రవీణ్ ఇంకేమైనా పేపర్స్ లీక్ చేశాడా?
అసలు ఎంతమందికి ఈ విషయం చెప్పాడో తెలియక పరీక్షలు నిర్వహించాలని వద్దని సందిగ్ధంలో ఉన్నది ప్రభుత్వం. అంతేకాదు.. ప్రవీణ్‌కు ఎక్కువ మంది మహిళలతోనే మొబైల్ కాంటాక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్ మొబైల్ ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు.. అతడు మహిళలతో సన్నిహితంగా మాట్లాడిన చాటింగ్‌లు, నగ్న చిత్రాలు ఉన్నట్లు గుర్తించారు.