Viveka Murder Case: వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్..!
AP సీఎం జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న YSRCP ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం పులివెందులలోని ఇంటికి చేరుకుని గంటకుపైగా విచారించిన అనంతరం అయన్ను అదుపులోకి తీసుకున్నారు. అలానే హైదరాబాద్ లో ఉన్న ఎంపీ అవినాశ్ రెడ్డి ఇంటికి కూడా అధికారులు వెళ్లారని సమాచారం.
ఇకపోతే మొదట YS వివేకా హత్య జరిగిన రోజున విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి YS వివేకా గుండెపోటు తో మరణించారు అని చెప్పిన సంగతి తెలిసిందే..