Viveka Murder Case : వివేకానంద హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. అవినాష్ రెడ్డి తన అరెస్టు విషయంలో సిబిఐ జోక్యం చేసుకోకూడదని, సీబీఐ విచారణ పట్ల తనకు అభ్యంతరం ఉందని, మద్యంతర పిటిషన్లు హైకోర్టులో దాఖలు చేశారు. కానీ ఆ పిటీషన్లను హైకోర్టు తిరస్కరించింది. అరెస్టు విషయంలో తాము జోక్యం చేసుకోబోమని, సీబీఐ విచారణ చేసుకోవచ్చు అని ఆదేశించింది. విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డ్
చేయాలని అవినాష్ రెడ్డి హైకోర్టు ను కోరగా, దానికి మాత్రం హైకోర్టు ఒప్పుకుంది. విచారణ సమయంలో అవినాష్ రెడ్డి వీడియో, ఆడియో రెండు కూడా రికార్డు చేయాలని సిబిఐ కి హైకోర్టు ఆదేశించింది.విచారణ సమయంలో అవినాష్ రెడ్డి లాయర్ తనతోనే ఉండాలని కోరగా, లాయర్ కి కనిపిస్తే చాలు,మాటలు వినిపించాల్సిన అవసరం లేదని, లాయర్ , అవినాష్ రెడ్డికి దూరంగా ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది.
అవినాష్ రెడ్డి మొత్తం 5 రిలీఫ్స్ కోరగా హైకోర్టు అందులో కేవలం రెండింటిని మాత్రమే అంగీకరించింది. 2019 ఎన్నికల్ల సమయంలో వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. అవినాష్ రెడ్డి ఎంపీ సిటు కోసం వివేకను మట్టు పెడితే ఆ సీటు తనకే వస్తుంది అనే రాజకీయ దురుద్దేశంతో, వివేకానంద రెడ్డిని హత్య చేసినట్లు వివేకానంద రెడ్డి కూతురు సునీత ఇంప్లిడ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేసు ముందుకు సాగుతున్న క్రమంలో తనకు
ఉచ్చు బిస్తుంది అని గ్రహించిన అవినాష్ హైకోర్టును ఆశ్రయించారు. మొదటి నుండి కూడా ఈ కేసులో అవినాష్ రెడ్డి పైనే అందరి అనుమానం ఉండేది. సిబిఐ కూడా తన దర్యాప్తులో అవినాష్ రెడ్డి మీదనే దృష్టి కేంద్రీకరించింది. ముందస్తు జాగ్రత్తగా వ్యూహాత్మక అడుగు వేసిన అవినాష్ రెడ్డికి చివరికి హైకోర్టు లో నిరాశ నే మిగిలింది. ఇంత క్లిష్టమైన స్థితిలో హైకోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.