Viveka Murder Case : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతున్న.. ఇప్పటికీ ఆ హత్య వెనుక ఉన్న అసలు నేరస్థుడు ఎవరు అనేది మాత్రం బయటికి రాలేదు. సిబిఐ దర్యాప్తు చివరి దశకు చేరుకుని, ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కరరెడ్డికి సీబీఐ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇద్దర్ని ఏకకాలంలో విచారణ చేపడుతుండడంతో తదుపరి అరెస్టుల పర్వం ఉంటుంది అనే తరుణంలోనే వివేకానంద కుమార్తె ఆసక్తికర ఆరోపణలు చేసారు.
తన తండ్రిని ఎంపీ టికెట్ కోసమే దారుణంగా హత్య చేసారు అని తన బాధను వ్యక్తపరిచారు. ఎంపీ అవినాష్ రెడ్డి కోర్టులో తప్పుడు కేసులు పెడుతున్నాడని.. తనతో పాటు తన భర్త, కుటుంబసభ్యులను బెదిరిస్తున్నాడని.. ఏపీ అధికారులు కేసు విచారణలో సహకరించడం లేదని.. ఆమె విచారణ వ్యక్తం చేసారు. ఎంపీ అవినాష్ రెడ్డే ఈ హత్యకు అసలు సూత్రధారి అని ఆరోపిస్తూ ఆమె హైకోర్టులో ఇంప్లిడ్ పిటీషన్ దాఖలు చేశారు.
అందులో కీలక అంశాలను ప్రస్తావించారు. 2019 ఎన్నికల్లో ఎంపీ సీటు ఇస్తారనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పిటీషన్ లో పేర్కొన్నారు. వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి చెప్పే ముందే హత్య గురించి అవినాష్‌కు తెలుసని తెలిపారు. హత్య చేశాక అందరినీ కాపాడుకుంటాడని, ఎర్రగంగిరెడ్డి మిగిలిన నిందితులకు అవినాశ్ చెప్పాడని సునీతారెడ్డి పేర్కొన్నారు.
మా నాన్న గుండెపోటుతో చనిపోయినట్టు అవినాష్ ప్రచారం చేసి అందరిని నమ్మించాడు. దానికి తోడు రక్తపు వాంతులు, గుండె పోటుతోనే మా నాన్న చనిపోయాడు అని పోలీసులు కూడా అబద్దాలు ప్రచారం చేసి ఇది హత్య కాదు, ఆత్మహత్యే అనేవిధంగా పోలీసులు కేసును తారుమారు చేసారు అని సునీత ఆరోపించారు.
ముందు నుండి కేసును తప్పుదోవ పట్టిస్తూ వచ్చిన అవినాష్ రూ.10 కోట్లు ఇచ్చి నేరాన్ని తన మీద వేసుకోమాన్ని గంగాధర్ ని ఒత్తిడికి గురి చేసినట్టు, గంగాధర్ ఇచ్చిన స్టేట్మెంట్ లో ఉందని సునీత రెడ్డి ఆరోపించారు. తాను చెప్పిన అంశాల కోణంలో నుండి కేసును దర్యాప్తు చేయాలి అని, అసలు నిందితులను అరెస్ట్ చేసి శిక్షించి, తమకు న్యాయం జరిగేలా చూడాలి అని సునీతా రెడ్డి తన నివేదికలో పేర్కొన్నారు.