Vizag KGH Hospital : బిడ్డ శవంతో బైక్ పై 120 కిలో మీటర్లు… స్పందించిన పవన్ కళ్యాణ్..!!
విశాఖపట్నం KGH ఆసుపత్రిలో 2 నెలల చిన్నారి మృతిపై జరిగిన అమానవీయ ఘటనపై జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైద్యం సంగతి దేవుడెరుగు..కనీసం చనిపోతే ఆ శవం తమ స్వగ్రామానికి తీసుకెళ్లాడానికి కూడా అంబులెన్సు ఏర్పాటు చేయని దుస్థితి లో జగన్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. మానవత్వం ఇసుమంతైనా లేని పాషాణ ప్రభుత్వం ఇదని తూర్పారపట్టారు. అభం శుభం తెలియని.. ఆర్దికంగా స్తోమత లేక ప్రభుత్వ ఆసుపత్రి కి వస్తే.. సరైన వైద్యం అందించాల్సిన ప్రభుత్వం ఆ గిరిజన కుటుంభం పట్ల చూపిన శ్రద్ధ ఇదేనా… పేదలకి ప్రభుత్వం అందిస్తున్న సేవలు ఎంత గొప్పగా ఉన్నాయో ఈ సంఘటనతో రుజువు అయ్యాయని…మనసనేది ఉంటే గనుక వీలైతే ఆ గిరిజన దంపతులకి జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు..
ప్రభుత్వ గొప్పల కోసం అంబులెన్సు లు రోడ్లపై నిలబెట్టి డ్రోన్ విజువల్స్ తీసి జెండా ఊపితే ప్రయోజనం ఉండదని… ఆ అంబులెన్సు లు ప్రజల కోసం.. ప్రజల అవసరాల కోసం.. ఏమైనా ఆపద వస్తే గనుక నిరంతరం ఉపయోగిస్తేనే ఉపయోగం ఉంటుందని ఈ సందర్బంగా జనసేనాని ప్రభుత్వానికి హితువు పలికారు..