Volunteer System in Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎజెండాలో చాలా చాలా విషయాలను ప్రస్తావించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కో హామీని నెరవేరుస్తూ ముందుకు వెళుతుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారం వేళలో సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణలోనూ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొస్తామని తెలిపారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు ఒక కీలక సమాచారం బయటకు వచ్చింది.
వాలంటీర్ వ్యవస్థ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఉంది. అక్కడ వలంటీర్ పనివిధానం వల్ల ఉపయోగకరంగానే ఉంది. ప్రజల సమస్యలను వాలంటీర్లు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి, ఇద్దరి మధ్య వారధిగా ఉంటారు. ఇప్పుడు అటువంటి వ్యవస్థనే తెలంగాణలోనూ ప్రవేశపెట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యాలరీల అమలు, ఉపాధి కల్పన, ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు, దృష్టికి తీసుకు వెళ్లడానికి వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఈ నేపథ్యంలో 80 మంది వాలంటీర్లను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.
నూతనంగా తెలంగాణలో ప్రవేశపెట్టనున్న ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడుతుందో వేచి చూడాల్సిందే. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సాఫీగా సాగితే అటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది.