• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Political News

Which Party Will Win in Andhra : ఆంధ్రాలో గెలుపు ఎవరిది..?

Rama by Rama
February 6, 2024
in Political News
0 0
0
Which Party Will Win in Andhra : ఆంధ్రాలో గెలుపు ఎవరిది..?
Spread the love

Which Party Will Win in Andhra : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు మరో  రెండు నెలల్లో ఉన్నాయి. దానికి సంబంధించి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ఒక్కో పార్టీ ఒక్కోరకంగా తమ సత్తాను చాటడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ సహజంగానే అన్ని పార్టీలలో ఉండే లోసుగులు బయటికి వచ్చి పార్టీల మీద ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని మరింత దూరం చేస్తున్నాయి. దాంట్లో ముఖ్యంగా అధికార పక్షంలో ఉన్నటువంటి వైసిపికి ఇప్పటికే ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది.

అక్రమాలకు, అవినీతికి అడ్డాగా వైసిపి మారిందని ప్రజలు గ్రహించారు. దీన్ని గ్రహించిన ప్రతిపక్షాలు వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటాలి అని ప్రజలకు మరింత దగ్గర అయ్యే రకంగా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో ముందుగా జనసేన పార్టీ గురించి మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే.. ఎన్నికలకు చాలా సమయం ఉన్న రోజుల నుండే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు దగ్గర అయ్యే మార్గాన్ని సుగమం చేసుకున్నారు. భారీ ఎత్తున బహిరంగ సభలు, రోడ్డు ర్యాలీలు, వారాహి విజయయాత్ర ద్వారా తను పూర్తిగా ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లారు.

ఈ రకంగా చూసుకుంటే ప్రజల మన్ననలు పొందిన ప్రధాన పార్టీ జనసేన అనే అవుతుంది. తర్వాత టిడిపి ఆ విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టినా కూడా మధ్యలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం, పార్టీలో కాస్త కలకలం రేపింది. కానీ ఈ కలకలాన్ని సద్దుమణిగేలా చేయడానికి నారా లోకేష్, బాలకృష్ణ తమ వంతు ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రజల్లో జనసేనకు ఉన్నంత మద్దతు టిడిపికి దొరకలేదని చెప్పవచ్చు. చంద్రబాబు బెయిల్ పైన బయటకు వచ్చి తన సత్తాను మళ్ళీ చాటి ప్రయత్నాన్ని చేశారు.

ఉన్న సమయాన్ని వినియోగించుకోవడం కోసం సభలు, సమావేశాలు నిర్వహించాలని కంకణం కట్టుకున్నారు. దీంట్లో భాగంగానే పొత్తు పెట్టుకున్న జనసేన నుండి కూడా ఎటువంటి వ్యతిరేకత రాకుండా అపోహలకు తావివ్వకుండా సీట్ల విషయంలో చర్చలు జరిపి ఆ విషయాన్ని కూడా ఒక కొలిక్కి తీసుకోవచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా సీట్ల కంటే కూడా ప్రజల బాగు గురించే ఆలోచించారు. కాబట్టి చంద్రబాబు చెప్పిన వాటికి ఆయన వెంటనే ఒప్పుకొని ఎవరున్నా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకునే నాయకులే కావాలి. 

మేము ఎంచుకునే నియోజకవర్గాల్లో మాకు గెలుపు తప్పకుండా వస్తుందని ధిమాను వ్యక్తం చేశారు. ఇక మరోవైపు వైసిపి కి కుటుంబం నుంచే వెన్నుపోటు మొదలైందని చెప్పవచ్చు. వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియామకం అవ్వడం, అన్న చేసిన అక్రమాలను నేరుగానే బహిర్గతం చేయడం. వైసిపికి పెద్ద నష్టాన్ని చేకూరుస్తుందని భావించవచ్చు. దీంట్లో భాగంగా ఇప్పుడు వైసీపీలో కూడా ఉన్నటువంటి లోసుగులు, పార్టీ నాయకుల్లో ఉన్నటువంటి అసంతృప్తులు బయటికి వస్తున్నాయి.

దాంతో భాగంగానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పైన మాజీమంత్రి అనీల్ కుమార్ వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ, ఆయనను పార్టీ నుంచి వైదొలిగే విధంగా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని కొన్ని వార్తలు బయటికి వచ్చాయి. ఎప్పటినుంచో సీనియర్ గా ఉంటున్న ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఈ విషయం పైన చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీ కోసమే ఇన్ని సంవత్సరాలు పనిచేశాను కానీ ఒకరి వల్ల పార్టీ మొత్తం నాశనం అవుతుంది ఇలా ఉంటే గెలవడం కష్టం. జగన్ మంచి వ్యక్తి అయినప్పటికీ తన చుట్టూ ఉన్నవాళ్లు పార్టీని నష్టపోయేలాగా ప్రవర్తిస్తున్నారు. అనిల్ ఆగడాలకు హద్దుపద్దు లేకుండా పోతుందని తీవ్రంగా విమర్శించారు.

ఇప్పుడు ఈ విమర్శలు వైసిపికి పెద్ద నష్టాన్ని చేకూర్చే లాగా ఉన్నాయి. ఇదే అదునుగా ప్రతిపక్షాలు కూడా ఈ విషయం గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఈరోజు ఈయన పరిస్థితి ఇలాగ ఉంటే ఇంకా సీనియర్లు అయినటువంటి సజ్జల రెడ్డి, సాయి రెడ్డి,సుబ్బారెడ్డిల పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలామంది కామెంట్ కూడా చేస్తున్నారు. వైసిపి సొంత పార్టీని ఉద్ధరించుకోలేనిది తర్వాత గెలిచి ప్రజలను ఉద్ధరిస్తుందని చాలామంది తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం మరోరకంగా ఉంది. ఇప్పటివరకు మూడు పార్టీలు తమదైన శైలిలో గెలుపు కోసం ఆరాటపడుతున్నాయి. కానీ ప్రజల తీర్పే తుది అయినది. దానికోసం పార్టీలు ఎంత శ్రమించినా కూడా ప్రజల మనసుల్లో ఎవరున్నారో స్థానాన్ని వాళ్లే గెలుచుకోగలుగుతారు. ఎన్ని ఏమైనాప్పటికీ వైసీపీ చేసిన అక్రమ దందాలు, ప్రజల బాగోగులు పట్టించుకోకపోవడం, ప్రజల కనీస అవసరాలు, నిరుద్యోగ సమస్యలు పరిష్కరించకపోవడం అనేది వైసిపి పార్టీ పట్ల ప్రజల్లో నిరుత్సాహాన్ని నింపాయి.

మరో రకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భరోసా ప్రజల్లో నూతన ఉత్తేజాన్ని తీసుకువస్తుంది. అంతర్గతంగా చేసిన చాలా సర్వేలు కూడా వైసీపీకి వ్యతిరేకంగానే ప్రజలు ఉన్నారు అని రిజల్ట్ ని చూపించాయి. ఎట్టకేలకు రాబోయే ఎన్నికల్లో జనసేన, టిడిపి పొత్తు కలిసి ఆంధ్రాలో నూతన శకానికి నాంది పలికే లాగా ఉన్నాయి.


Spread the love
Tags: BjpChandrababuNaiduJanasenaNadendla ManoharTdpWhich Party Will Win in AndhraYCPYS SharmilaYSJagan
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.