YS Jagan Nadu Nedu Programme : చదువు సంగతి ఏమోకానీ స్నానం ఎక్కడ చేయాలి జగన్ మావయ్య…?? విద్యార్ధినుల ఆవేదన..!!
వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నాం అని చెప్పుకునే పథకాల్లో “నాడు-నేడు” కార్యక్రమం ఒకటి..
ఈ కార్యక్రమం లో భాగంగా పాఠశాలల ఆధునికీకరణ.. మౌలిక వసతుల ఏర్పాటు.. కొత్త ఫర్నిచర్.. నాణ్యమైన చదువుతో పాటు ఆరోగ్యావంతమైన ఆహారం అందిచడంతో పాటు ఇంగ్లీష్ బోధన కూడా ప్రవేశ పెట్టి అమలుచేయాలన్నది జగన్ ప్రభుత్వ ఆలోచన.. అయితే ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా చాలా చక్కగా అమలుచేస్తున్నాం..ఎక్కడా లోటుపాట్లు లేవు అని నిత్యం చెప్పుకునే ప్రభుత్వ మాటలు చూస్తుంటే మాత్రం నిజమే అనిపించకమానదు..
పైగా బెండపూడి విద్యార్థులకి చాలా చక్కగా ఇంగ్లీష్ నేర్పాం.. ఇది మా ప్రభుత్వ ఘనత అని ఆ విద్యార్థులని రాష్ట్రం మొత్తం తిప్పి జబ్బలు చరచుకున్న జగన్ గారి వాలకం చూసి .. అందరు తల్లిదండ్రులు రాష్ట్రంలో మిగతా స్కూల్లో కూడా ఇలానే ఉంటాయ్ అనుకున్నారు పాపం.. కానీ వాస్తవికతకి వచ్చేసరికి పరిస్థితి ఇంకోలా ఉంది.. ఇప్పటికీ అనేక చోట్ల స్కూళ్ళ లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయనే చెప్పాలి..
అందుకు అనకాపల్లి జిల్లా ఎస్. రాయవరం మండలం లింగరాజుపాలెం లోని కస్సుర్భా బీసీ రెసిడెన్షియల్ విద్యార్థుల పడుతున్న అవస్థలే ఉదాహరణ గా చెప్పుకోవచ్చు.. అక్కడ కనీసం మహిళా విద్యార్థులకి స్నానం చేయడానికి కూడా సరైన వసతులు లేకపోవడం బాధాకరం.. విద్యార్థులు మాట్లాడుతూ.. “హాస్టల్ లో బాత్ రూమ్స్ లేకపోవడం వల్ల బెడ్ షీట్స్ అడ్డం పెట్టుకొని, లైట్స్ ఆఫ్ చేసుకొని వరండాలోనే స్నానం చేస్తున్నాం” అని కన్నీరు పెట్టుకుంటున్నారు.. తమపై జగన్ ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులపై ఎన్నో ఆశలు పెట్టుకొని.. మా భవిష్యత్ కోసం ఇక్కడికి పంపితే.. తీరా ఇక్కడికి వచ్చాక పరిస్థితులు ఇంకోలా ఉన్నాయని చదువు కూడా బాగాలేదని విద్యార్థులు వాపోయారు. ఇప్పటికైనా గొప్పలు మాని..స్కూల్లలో విద్యార్థులకి కనీస అవసరాలతో పాటు మంచి చదువు.. పౌష్ఠిక ఆహారం అందించాలని వైసీపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు..
ఇవి కూడా చదవండి..