YS Sharmila : కల్లు తాగిన షర్మిల…!!
YSRTP అధినేత్రి షర్మిల తన పాదయాత్రలో భాగంగా ప్రజల కష్టాలు తెలుసుకుంటూ జనగాం జిల్లా పాలకుర్తి లోకి ప్రవేశించడం జరిగింది. అయితే షర్మిల పాదయాత్రలో భాగంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పాలకుర్తి లోని లక్ష్మీనారాయణ పురం స్టేజీ వద్దకు రాగానే అక్కడ ఉన్న కల్లు గీత కార్మికుడి వద్ద ఆగి కష్టాలు తెలుసుకుంటున్న క్రమంలో… ఓ కల్లు గీత కార్మికుడి కోరిక మేరకు తాటికల్లు ఆకులో పోయగా షర్మిల రుచి చూశారు.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ “కేసీయార్ ప్రభుత్వం లో అన్ని కులాలవారు నష్టపోయారు.. ఆర్థికంగా ఆదుకోవడం మానేసి.. వారిని బాగుచేయాలనే సోయి మరచి కేవలం తమ స్వార్థం కోసం మాత్రమే పనిచేస్తున్నారు అని.. అసలు తెలంగాణలో అభివృద్ధి అనేదే కనబడటం లేదని” మండిపడ్డారు. వైయస్సార్టీపీ తెలంగాణా లో అధికారం లోకి రాగానే కల్లుగీత కార్మికుల అందరి సమస్యలతో పాటు అన్ని కులాల వారికి అండగా ఉంటామని.. అందరి సమస్యలు పరిష్కరిస్తాం అని హామీ ఇచ్చారు.