• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Reviews

18 పేజెస్ మూవీ రివ్యూ..

TrendAndhra by TrendAndhra
February 21, 2023
in Reviews
272 3
0
18 Pages Movie Review in Telugu
535
SHARES
1.5k
VIEWS
Share on FacebookShare on Twitter
Spread the love

సినిమా రివ్యూ : 18 పేజెస్

నటీనటులు : నిఖిల్ సిద్ధార్థ, అనుపమా పరమేశ్వరన్, సరయు, దినేష్ తేజ్, అజయ్ తదితరులు
కథ : సుకుమార్
సంగీతం : గోపి సుందర్
సమర్పణ : అల్లు అరవింద్
నిర్మాత : ‘బన్నీ’ వాస్
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : పల్నాటి సూర్య ప్రతాప్
విడుదల తేదీ: డిసెంబర్ 23, 2022

ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు..
ఎందుకు ప్రేమించావని అడిగితే ఆన్సర్ ఉండకూడదు..

18 Pages… సినిమా కథ అంతా క్లుప్తంగా ఈ లైన్ పై బెస్ అయి ఉంటుంది. ఇదోక సరికొత్త ప్రయోగం అని చెప్పడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే సినిమా చూస్తున్నంత సేపు చివరి వరకూ కలుసుకోకుండా ఒకరినోకరు ఆరాధించుకునే ప్రేమికుల కధలైన యండమూరి వీరేంద్రనాథ్ “వెన్నెల్లో ఆడపిల్ల” నవల, 90 లలో వచ్చిన అజిత్ “ప్రేమలేఖ” సినిమాలకు కాస్త దగ్గరి పోలికలు కనిపిస్తాయ్.. బట్ ఇవేమీ తెలియని
ఈ ఆధునిక తరానికి ఫ్రెష్ గా అనిపిస్తుంది.

స్మార్ట్ ఫోన్ యుగంలో మారుతున్న జీవనశైలి వలన మనం వ్యక్తిగతంగా ఏం కోల్పోతున్నాం అనే చిన్న చిన్న విషయాలను కూడా, డెప్త్ తో కూడిన సన్నివేశాల ద్వారా చెప్పాలని మూవీ టీమ్ చేసిన ప్రయత్నం మెచ్చుకోతగినది. మ్యాథమెటిక్స్ డైరెక్టర్ సుకుమార్ కలం చేసిన మ్యాజిక్ ని ఆస్వాదించాలంటే ఖచ్చితంగా లాజిక్ లకు దూరంగా మూవీని చూడాలి.

టైటిల్ తగినట్లుగా 18 పేజెస్ లో ప్రతి పేజీని ప్రేమతో నింపిన వైనం, క్లైమాక్స్ లో హీరో హీరోయిన్లు కలుసుకునే సన్నివేశంలో మాటలు లేకుండా కేవలం భావవ్యక్తీకరణ ద్వారా దగ్గరవడం లాంటివి బావుకులను ఆకట్టుకుంటాయి… బట్ ప్రేమంటే రెండు హగ్గులు, నాలుగు కిస్సులు అనుకునే నేటి 2022 వాట్సప్ చాటింగ్ యూత్ కి ఎంత వరకూ కనక్ట్ అవుతుందనేది సందేహమే..

నటీనటుల విషయానికొస్తే ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్ అయిన నిఖిల్ మరోసారి తన పాత్రలో అలవోకగా ఒదిగిపోయాడు. ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా కార్తికేయ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ప్యూర్ లవ్ స్టోరీని డెలివరీ చేసిన నిఖిల్ ప్లానింగ్ ని ఖచ్చితంగా అభినందించాలి.

పక్కింటి అమ్మాయి లా అనిపించే నందిని పాత్రకు అనుపమ పరమేశ్వరన్ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చింది. హీరోయిన్ అంటే సగం సగం బట్టలు, రెండు మూడు లిప్ లాక్ లు, ఒక బెడ్ రూమ్ రొమాన్స్ సీన్ లు చూపే బీ గ్రేడ్ ఆలోచనలతో కాకుండా నందిని పాత్రను తీర్చి దిద్దిన విధానం ఆ పాత్రకే వన్నె తెచ్చింది.

హీరో ఫ్రెండ్ బాగీ పాత్రలో నటించిన బిగ్ బాస్ ఫేమ్ సరయూ కి ఈ మూవి పెద్ద బ్రేక్ త్రూ..
వీళ్ళు తప్ప మూవీలో చర్చించుకోదగిన పాత్రలు చాలా తక్కువ.

సాంకేతికంగా చూస్తే ఎం. వసంత్ సినిమాటోగ్రఫీ దర్శకుడి ఊహలకు రూపం ఇవ్వడమే తప్ప, అందులో తనదైన ముద్రను చూపే విధంగా లేదనే చెప్పాలి. నిన్న మొన్ననే వచ్చిన ప్యూర్ లవ్ స్టోరి సీతారామం స్దాయి విజువల్స్ ని ఆశిస్తే నిరాశే ఎదురవుతుంది. ఈ విషయంలో బడ్జెట్ పరిమితులు అతడిని కంట్రోల్ చేసాయి..

కోవిడ్ వలన అండర్ ప్రొడక్షన్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న మూవీ కాబట్టి బడ్జెట్ పరంగా ఆచితూచి ఖర్చు చేశారు. బన్నీ వాస్ స్టోరీ సెలక్షన్ పరంగా గీత ఆర్ట్స్ అల్లు అరవింద్ కి జిరాక్స్ కాపీ మైండ్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. గోపి సుందర్ మ్యూజిక్ మూవీకి చాలా హెల్ప్ అయింది. ఇంకాస్త ఎఫర్ట్ పెట్టి ఉంటే మూవీ మరో స్దాయిలో ఉండేది.

మొత్తం గా మల్టీప్లెక్స్ మరియు OTT ఆడియన్స్
టార్గెట్ గా తీసిన ఈ మూవీ మాస్ ప్రేక్షకులకు ఎంతవరకు రీచ్ అవుతుందనేది ప్రశ్నార్థకమే..

రేటింగ్:-3/5

Like Reaction0Like
Like Reaction0Love
Like Reaction0Haha
Like Reaction0Shocked
Like Reaction0Sad
Like Reaction0Angry

Spread the love
Tags: 18 Pages Movie Review in TeluguLatest Telugu Movie ReviewsLatest Telugu NewsNikhil Anupama Parameswaran Latest MovieTrend Andhra News
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.