Agent Movie Review : మూవీ : ఏజెంట్
నటీనటులు : అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య, మమ్ముట్టి.
నిర్మాత : అనిల్ సుంకర
దర్శకత్వం : సురేందర్ రెడ్డి
సంగీతం : హిప్ హాప్ తమిళ
విడుదల తేదీ : ఏప్రిల్ 28, 2023
అక్కినేని హీరో అఖిల్ కి ఇప్పటి వరకు ప్రాపర్ హిట్ పడలేదు. తాజాగా `ఏజెంట్` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. స్పై థ్రిల్లర్‌గా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు విడుదలైంది. మరి అయ్యగారి ఏజెంట్ మూవీ తొలి హిట్ ఇచ్చిందో లేదో చూద్దాం..
కథ :
మూవీ.. మహదేవ్ (మమ్ముట్టి) అనే ఒక చీఫ్ తో మొదలవుతుంది. మహదేవ్ ఒక మిషన్ మీద ఉంటారు. గాడ్ (డినో మోరియా) అనే ఒక డాన్ ని పట్టుకోవాలి అనుకుంటారు. దీని కోసం వారు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదే సమయంలో రామకృష్ణ (అఖిల్ అక్కినేని) అనే ఒక హ్యాకర్ మహదేవ్ తో కలిసి వారి ఏజెన్సీలో పని చేయడానికి మహదేవ్ ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.
రామకృష్ణ వారితో కలిశాడా? ఆ తర్వాత రామకృష్ణ ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? వాటి నుండి ఎలా బయటపడ్డాడు? చివరికి వారు అనుకున్న మిషన్ సాధించారా? ఇంతకీ అసలు వారు వెతుకుతున్న వ్యక్తి ఎక్కడున్నాడు? ఇవన్నీ తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
రివ్యూ:
ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడని సినిమా చూస్తే అర్ధమవుతుంది. యాక్షన్ సన్నివేశాల్లో అఖిల్ అదరగొట్టాడు. అయితే నటనలో కొద్దిగా తేలిపోయాడు. ఇక కథానాయిక సాక్షి వైద్య తన నటనతో పర్వాలేదనిపించింది.
మమ్ముట్టితో పాటు ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు. ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి మూవీని అందంగా మలచడంతో విఫలమయ్యాడనే చెప్పాలి. ఈ సినిమాకి కథలో మ్యాటర్ లేదు. సోల్ పూర్తిగా మిస్ అయింది. ఇంటర్వెల్, క్లైమాక్స్ పర్వాలేదు కానీ లవ్ స్టోరీ, మ్యూజిక్, బీజీఎమ్, విలన్ రోల్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు.
ప్లస్ పాయింట్స్ :
* ఇంటర్వెల్
* టెర్రీఫిక్ యాక్షన్ స్టంట్స్
* మమ్ముట్టి నటన
మైనస్ పాయింట్స్ :
* కథ
* లవ్ స్టోరీ
* బీజీఎమ్
రేటింగ్ : 2.5/5
ట్యాగ్ లైన్ : యాక్షన్ మూవీస్ ఇష్టపడే వారు ఏజెంట్ ఒక్కసారి చూడగలిగే సినిమా. అక్కినేని అభిమానులకి మాత్రమే ఈ మూవీ నచ్చుతుంది.