Citadel Web Series Review : వెబ్ సిరీస్ రివ్యూ : సిటాడెల్
నటీనటులు : రిచర్డ్ మాడెన్, ప్రియాంక చోప్రా, స్టాన్లే టుక్సి, లెస్లే మ్యాన్‌విల్లే, ఓసీ ఇఖిలే, యాష్లే కమ్మింగ్స్ తదితరులు
ఫోటోగ్రఫీ : న్యూటన్ థామస్ సిగెల్, మైకేల్ వుడ్
మ్యూజిక్ : అలెక్స్ బెల్చర్
డైరెక్టర్ : న్యూటన్ థామస్ సిగెల్, జెస్సికా యు, రుసో బ్రదర్స్
ప్రొడ్యూసర్ : అమెజాన్ ప్రైమ్ వీడియో
విడుదల తేదీ : ఏప్రిల్ 28, 2023
ఎపిసోడ్స్ : 2 (వారానికి ఒకటి చొప్పున విడుదల అవుతాయి)
ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో
గేమ్ ఆఫ్ త్రోన్స్’ ఫేమ్ రీఛార్జ్ మాడెన్, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న యాక్షన్ సిరీస్ సిటడేల్. ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’, ‘అవెంజర్స్ : ఎండ్ గేమ్’ సినిమాల దర్శకులు రూసో బ్రదర్స్ ఈ సిరీస్ ను తెరకెక్కించారు. ఈ సిరీస్ ఎలా ఉందో చూద్దాం..
కథ :
ఎఫ్ బీఐ, ఎంఐ6, బీఎల్డీ, ఎఫ్ఎస్బీ, రా, ఐఎస్ఐలాగే సిటడెల్ అనేది ఒక స్పై ఏజెన్సీ. ప్రపంచవ్యాప్తంగా కొందరు వ్యక్తులు కలిసి ఫ్రాన్స్ వేదికగా దీనిని స్థాపిస్తారు. ఏ ఒక్క దేశానికో కాకుండా ప్రజలందరి సంరక్షణ బాధ్యతే ప్రధాన లక్ష్యంగా ఇది పనిచేస్తుంది. ‘సిటడెల్ ను ఎలాగైనా నాశనం చేసి ప్రపంచ దేశాలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని కొందరు సంపన్నులు కలిసి ‘మాంటికోర్’ అనే సొంత స్పై సంస్థ ఏర్పాటు చేస్తారు.
సిటడెల్లో టాప్ స్పై ఏజెంట్లు అయిన మేసన్ కేన్ (రిచర్డ్ మ్యాడెన్), నాదియా సిన్హ్ (ప్రియాంక చోప్రా)లను తప్పుదోవ పట్టించి వాళ్లను అంతం చేసేందుకు మాంటికోర్ ప్రయత్నిస్తుంది. మరి ఆ దాడి నుంచి మేసన్, నాదియా ఎలా తప్పించుకున్నారు? ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన పరిస్థితులు ఏంటి? సిటడెల్ ను పునరుద్ధరించి, మాంటికోర్ ను అడ్డుకునేందుకు వీళ్లు చేసిన ప్రయత్నం ఏంటి? తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే!
రివ్యూ :
ఒక కుట్ర కారణంగా సమూలంగా అంతం అయిన ఒక స్పై ఏజెన్సీకి చెందిన ఇద్దరు ఏజెంట్లు ప్రపంచాన్ని కాపాడటానికి మళ్లీ ఎలా కలిశారన్నది ఈ ఎపిసోడ్లలో చూపించారు. అసలు ప్రమాదం ఏంటి? సిటాడెల్‌లో ఉన్న డబుల్ ఏజెంట్ ఎవరు? ఇలా చాలా ప్రశ్నలు ఈ రెండు ఎపిసోడ్లు చూశాక మనకి తలెత్తుతాయి. తర్వాతి ఎపిసోడ్ల కోసం ఎదురు చూసేలా చేస్తాయి. నిజానికి మేకర్స్‌కు కావాల్సింది కూడా ఆ క్యూరియాసిటీ క్రియేట్ చేయడమే. అందులో మాత్రం సక్సెస్ అయ్యారు.
ఒక్కో ఎపిసోడ్ నిడివి కేవలం 40 నిమిషాలు మాత్రమే ఉంది. కాబట్టి రెండు ఎపిసోడ్లను గంటన్నర లోపే స్ట్రీమ్ చేయవచ్చు. మొదటి సన్నివేశం నుంచే కథలోకి పూర్తిగా ఇన్వాల్వ్ చేస్తారు. పాత్రల పరిచయానికి ప్రత్యేకంగా సమయం తీసుకోకుండా కథలో భాగంగానే పాత్రల పరిచయం జరిగేంత టైట్‌గా స్క్రీన్‌ప్లే రాసుకున్నారు. దాదాపు రూ.2,500 కోట్ల బడ్జెట్‌తో ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఆ ఖర్చు మొత్తం స్క్రీన్ మీద కనిపిస్తుంది. వీలైనంత పెద్ద స్క్రీన్ మీద ఈ సిరీస్‌ను చూస్తే ఆ ఎక్స్‌పీరియన్స్ బాగుంటుంది.
పాజిటివ్ పాయింట్స్ :
* నటీనటుల ప్రదర్శన
* స్టోరీ
మైనస్ పాయింట్స్:
* స్టోరీ ల్యాగ్
* గందరగోళంగా ఉన్న సన్నివేశాలు
* మ్యూజిక్
రేటింగ్ : 2.5/5
ట్యాగ్ లైన్ : స్పై, యాక్షన్, థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లను ఇష్టపడే వారికి ‘సిటాడెల్’ మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.