Kabzaa Movie Review : చిత్రం : కబ్జా
నటీనటులు : ఉపేంద్ర, కిచ్చా సుదీప్, డాక్టర్ శివరాజ్ కుమార్, శ్రియ శరణ్.
నిర్మాత : ఆర్ చంద్రు, అలంకార్ పాండియన్, ఆనంద్ పండిట్
దర్శకత్వం : ఆర్ చంద్రు
సంగీతం : రవి బస్రూర్
విడుదల తేదీ : 17 మార్చ్, 2023
శాండల్ వుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపును సంపాదించుకున్న ఉపేంద్ర, కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా మూవీ “కబ్జా”. ఆర్ చంద్రు వ్రాసి దక్షకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రియ శరణ్ హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ చిత్రంలో శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటించారు. తెలుగులో నిర్మాత ఎన్ సుధాకర్ రెడ్డి సమర్పకుడిగా హీరో నితిన్ సొంత బ్యానర్స్ రుచిరా ఎంటర్టైన్మెంట్స్, ఎన్ సినిమాస్ పతాకాలపై ఈ చిత్రం విడుదలైంది.
కథ :
ఆర్కేశ్వర (ఉపేంద్ర) ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్. తన సోదరుడి మరణం తర్వాత వారిపై పగ తీర్చుకోవడానికి కొంతమంది గుండాలతో చేతులు కలుపుతాడు. అమరాపూర్ లో ఉన్న లోకల్ రౌడీని చంపి అక్కడి వారికి ఒక రక్షకుడిగా మారుతాడు. మధుమతి (శ్రియ) వీర్ బహదూర్ అనే ఒక రాజకీయ నాయకుడి కూతురు. తన తండ్రికి ఇష్టం లేకుండానే ఆర్కేశ్వరని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది.
ఆ తర్వాత ఆర్కేశ్వర మెల్లగా నార్త్ ప్రాంతంలో పేరు మోసిన గ్యాంగ్ స్టర్ గా ఎదుగుతాడు. ఆ తర్వాత కథలోకి భార్గవ బక్షి (కిచ్చ సుదీప్) అనే ఒక పోలీస్ ప్రవేశిస్తాడు. ఇది కేవలం మొదటి భాగం మాత్రమే. ఆ తర్వాత జరగబోయేది ఏంటి? భార్గవ బక్షి పాత్ర ఎలా ఉండబోతోంది? ఆర్కేశ్వర అన్నని చంపింది ఎవరు? ఆర్కేశ్వర తర్వాత ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
1947 నుంచి 1984 కాలంలో నడిచే ఈ కథలో ఓ స్వతంత్ర సమరయోధుడి కొడుకు.. బ్రిటిష్ పాలనలో వైమానిక దళాధిపతి అయిన ఉపేంద్ర.. అనివార్య పరిస్థితుల కారణంగా మాఫియా వరల్డ్ లో ఎలా చిక్కుకున్నాడు, ఆ తర్వాత ఏ రేంజ్ కు చేరుకున్నాడనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు.
ఈ చిత్రంలో కిచ్చా సుదీప్ స్క్రీన్ ప్రజెన్స్ సూపర్ గా ఉంది. కబ్జా శాండిల్ వుడ్ ఇండస్ట్రీని మరోసారి గర్వపడేలా చేస్తుంది. నిజానికి ఈ స్టోరీ విన్నా, ట్రైలర్ చూసిన కేజిఎఫ్ గుర్తుకు రావడం ఖాయం. ఆ మూవీ రెండు భాగాలుగా సూపర్ డూపర్ హిట్ కావడంతో.. వాటి ప్రభావం ఈ మూవీ పై పడినట్లు మేకింగ్ చూస్తే స్పష్టంగా కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
* ఉపేంద్ర షో
* మ్యూజిక్
* దర్శకత్వం
మైనస్ పాయింట్స్:
* రొటీన్ కథ
* కేజిఎఫ్ ను పోలి ఉండడం
రేటింగ్ 2.5/5
ట్యాగ్ లైన్ : పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా యాక్షన్ సినిమా ఎంజాయ్ చేయాలి అనుకునే వారు ఒకసారి చూడగలిగే యావరేజ్ మూవీ.