• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Reviews

Nenu Student Sir Movie Review : బెల్లంకొండ గణేష్ “నేను స్టూడెంట్ సర్” మూవీ రివ్యూ అండ్ రేటింగ్..

R Tejaswi by R Tejaswi
June 2, 2023
in Reviews
0 0
0
Nenu Student Sir Movie Review : బెల్లంకొండ గణేష్ “నేను స్టూడెంట్ సర్” మూవీ రివ్యూ అండ్ రేటింగ్..
Spread the love

Nenu Student Sir Movie Review : నటీనటులు : బెల్లంకొండ గణేష్, అవంతిక దాసాని, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు

ఫోటోగ్రఫీ : అనిత్ కుమార్
మ్యూజిక్ : మహతి స్వర సాగర్
నిర్మాత : నాంది సతీష్ వర్మ
రచన : కృష్ణ చైతన్య
డైరెక్టర్ : రాకేష్ ఉప్పలపాటి
విడుదల తేదీ : జూన్ 2, 2023

మొదటి సినిమా ‘స్వాతిముత్యం’తో మంచి పేరు తెచ్చుకున్న హీరో బెల్లంకొండ గణేష్. టీజర్, ట్రైలర్లతోనే ‘నేను స్టూడెంట్ సర్’ మంచి థ్రిల్లర్ కథాంశంగా ఆకట్టుకుంది. ఒక సెల్ ఫోన్, దాని చుట్టూ తిరిగే క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో చూద్దాం..

స్టోరీ :
సుబ్బారావు (బెల్లంకొండ) కాలేజ్ స్టూడెంట్. ఐఫోన్ 12 అంటే పిచ్చి. తొమ్మిది నెలలు కష్టపడి రూ.90 వేలు సంపాదించి ఐఫోన్ 12 కొనుక్కుంటాడు. సరిగ్గా ఫోన్ కొన్న రోజునే కాలేజీలో గొడవ జరిగి పోలీస్ స్టేషన్‌కి వెళ్లాల్సి వస్తుంది. అక్కడ పోలీసులు సుబ్బు ఫోన్ కలెక్ట్ చేసుకుంటారు. తన ఫోన్ కోసం తిరిగి వెళ్లినప్పుడు అక్కడ సుబ్బు ఫోన్ దొరకదు. దీంతో సుబ్బు ఈ విషయం మీద కమిషనర్ అర్జున్ వాసుదేవన్‌కు (సముద్రఖని) కంప్లయింట్ ఇవ్వడానికి వెళ్తాడు.

అతను కూడా పట్టించుకోకపోవడంతో కమిషనర్ కూతురు శ్రుతి వాసుదేవన్‌తో (అవంతిక దాసాని) ఫ్రెండ్‌షిప్ చేసి ఫోన్ దక్కించుకోవాలి అనుకుంటాడు. ఫోన్ కోసం చేసిన ఫ్రెండ్‌షిప్ సుబ్బు మీద మర్డర్ కేస్ పడేలా ఎలా చేసింది? ఈ కేసు నుంచి సుబ్బు ఎలా బయటపడ్డాడు? తన ఫోన్ దొరికిందా? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

రివ్యూ :
నేను స్టూడెంట్‌ సర్‌ సినిమాకు తీసుకున్న కాన్సెప్ట్‌ కీలకమని చెప్పవచ్చు. ట్రైలర్‌లో చూపిన విధంగా పోగొట్టుకున్న ఐఫోన్ చుట్టూ తిరిగే కథ మాత్రమే కాదు. సమ్ థింగ్ స్పెషల్ గా అనిపించే ఈ కాన్సెప్ట్ ప్రమోషన్స్ లో ఎక్కడా రివీల్ కాలేదు. కానీ సినిమాను మాత్రం చాలా సాగదీశారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా కొనసాగుతుంది. ఇంటర్వెల్ దగ్గరలోనే అసలు స్టోరీ మొదవుతుంది.

బెల్లంకొండ గణేష్ డైలాగ్ ‘బ్లాక్ ఐఫోన్… 12 సిరీస్… 64 జీబీ… రూ. 89,999″ ఫస్టాఫ్‌లో కనిపించిన ప్రతిసారీ ఐఫోన్‌ని ‘తమ్ముడు బుజ్జిబాబు’ అని పిలవడం చాలా చిరాకు తెప్పిస్తుంది. ఒక సాధారణ మధ్యతరగతి కుర్రాడు ఐఫోన్ కోసం కమిషనర్‌ దగ్గరకు వెళ్లి దాని కోసం తన ప్రాణాలను పణంగా పెట్టడం కొంచెం రిస్క్ మాదిరిగా ఉంటుంది. టిక్ టాక్ ట్రాక్ లవ్ స్టోరీని ఫస్ట్ హాఫ్‌లో హ్యాండిల్ చేయడం వల్ల కథకు ఎటువంటి సంబంధం లేకుండా పోయింది. రెండో భాగం కాస్త నిదానంగా ఉంది.

కథలోని ట్విస్టులు క్రమంగా వెలుగులోకి వస్తాయి. కొన్ని సందర్భాల్లో లాజిక్ లోపించినట్లు అనిపిస్తుంది. అదే బలమైన స్క్రీన్‌ప్లేకు ఉంటే మంచి థ్రిల్లర్ మూవీగా మారిపోయేది. మహతి స్వర సాగర్ ఉత్తమంగా వ్రాసిన పాటలలో ‘మాయే మాయే’ ఒకటి. సెకండాఫ్ అంతా ఆకట్టుకునే నేపథ్య సంగీతాన్ని ఉపయోగించారు.

ఎవరెలా చేశారంటే..
బెల్లంకొండ గణేష్ మొదటి భాగంలో అమాయకంగా కనిపిస్తాడు. రెండవ భాగంలో ఇంకొంచెం పర్లేదు. మామూలు కథల కంటే ప్రత్యేకమైన కథలను ఎంచుకుని తన క్యారెక్టర్ కు న్యాయం చేశాడని చెప్పవచ్చు. అవంతిక దాసాని, శృతి వాసుదేవన్‌లు కూడా పర్వాలేదు. కానీ డైలాగ్స్ విషయంలో లిప్ సింక్ లేకపోవడం కొంచెంగా లోపంగా అనిపిస్తుంది. ఎప్పటిలాగే సముద్రఖని కమిషనర్‌గా పనిచేశారు. సునీల్ కూడా ఓకే. జబర్దస్త్ రాంప్రసాద్ ఉన్నప్పటికీ నటనకు పెద్దగా స్కోప్ ఉన్నా క్యారెక్టర్ దొరకలేదు.

ప్లస్ పాయింట్స్ :
* హీరో, సముద్రఖని యాక్టింగ్
* స్టోరీ కాన్సెప్ట్
* కొన్ని ఫన్నీ సీన్స్

మైనస్ పాయింట్స్ :
* స్లో నారేషన్
* స్క్రీన్ ప్లే
* సాంగ్స్

రేటింగ్ : 2.25/5

ట్యాగ్ లైన్ : స్టూడెంట్ అక్కడక్కడ మెప్పిస్తాడు. థియేటర్ లో చూడాలంటే ఆలోచించాల్సిందే..


Spread the love
Tags: BellamkondaGaneshMovieReviewNenu Student Sir Movie ReviewNenu Student Sir ReviewNenuStudentReviewinTeluguNenuStudentSirNenuStudentSirMovieNenuStudentSirTeluguReview
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.