Phalana Abbayi Phalana Ammayi Review : నటీనటులు : నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, వారణాసి సౌమ్య చలంచర్ల, హరిణి రావు, అర్జున్ ప్రసాద్ తదితరులు
సంగీతం : కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్ (కాఫీఫై సాంగ్)
సహా నిర్మాత : వివేక్ కూచిభొట్ల
నిర్మాతలు : టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి
కథ, కథనం, మాటలు, దర్శకత్వం : శ్రీనివాస్ అవసరాల
విడుదల తేదీ : మార్చి 17, 2023
నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఫలానా అబ్బాయి ఫలానాఅమ్మాయి. శ్రీనివాస్ అవసరాల, మేఘా చౌందరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి లాంటి నటులు కీలకపాత్రలు చేసిన ఈసినిమా ఈరోజు థియేటర్లలో సందడి చేస్తుంది.
కథ :
సంజయ్ (నాగశౌర్య) బీటెక్ జాయిన్ అయినప్పుడు సీనియర్స్ ర్యాగింగ్ నుంచి అనుపమ (మాళవికా నాయర్) సేవ్ చేస్తుంది. తొలుత ఫ్రెండ్స్ అవుతారు. ఎంఎస్ కోసం లండన్ వెళ్ళినప్పుడు ప్రేమలో పడతారు. అనుపమ సీనియర్ కావడంతో ఏడాది ముందుగా చదువు పూర్తి అవుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంది. వేరే సిటీలో ఆమెకు ఉద్యోగం వస్తుంది.
తనకు చెప్పకుండా ఉద్యోగానికి అప్లై చేసినందుకు, తనకు దూరంగా వెళుతున్నందుకు సంజయ్ హ్యాపీగా ఉండదు. ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అదే సమయంలో పూజ (మేఘా చౌదరి)తో స్నేహం మొదలు అవుతుంది. సంజయ్, అనుపమ మధ్య దూరం పెరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? కొన్నాళ్ళ తర్వాత ఇద్దరూ కలిసినప్పుడు ఏం జరిగింది? మధ్యలో గిరి (శ్రీనివాస్ అవసరాల), వాలెంటైన్ (అభిషేక్ మహర్షి), కీర్తి (శ్రీవిద్య) పాత్రల పరిధి ఏమిటి? చివరికి ఇద్దరూ కలిశారా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ :
సినిమా కథ అంతా చాలా సరదాగా సాగిపోతుంది. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూస్తున్నాం అని అనిపిస్తుంది. వాళ్ల సంభాషణలు కూడా భారీగా లేకుండా నిజ జీవితంలో ఎలా మాట్లాడుకుంటారో అలాగే ఉంటాయి. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో హీరోయిన్లు ఇద్దరూ కూడా డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించారు. ఇద్దరూ తమ పాత్రలకి న్యాయం చేశారు.
ప్లస్ పాయింట్స్:
* కథ
* కామెడీ
* పాటలు
* హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ
మైనస్ పాయింట్స్:
* సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్
* అక్కడక్కడ ల్యాగ్ అయిన కొన్ని ఎపిసోడ్స్
రేటింగ్ : 2.75
ట్యాగ్ లైన్ :
ఇటీవల కాలంలో వచ్చిన ప్రేమ కథల్లో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ..