PS2 Movie Review : చిత్రం : పొన్నియిన్ సెల్వన్ 2
నటీనటులు : విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష.
డైరెక్టర్ : మణిరత్నం
నిర్మాత : మణిరత్నం, సుభాస్కరన్ అల్లిరాజా
మ్యూజిక్ : ఏఆర్ రెహమాన్
విడుదల : 28 ఏప్రిల్ 2023.
స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన భారీ సినిమా పొన్నియన్ సెల్వన్ 2. ప్రముఖ నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా తెరకెక్కిన ఈ కథను రెండు భాగాలుగా చిత్రీకరించారు. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ PS1 విడుదలై విజయం సాధించగా.. ఇప్పుడు PS2 ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ రోజు పొన్నియన్ సెల్వన్ 2 మూవీని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేశారు. పార్ట్ 2 ఎలా ఉందో చూద్దాం..
కథ :
రాజ్యాన్ని హస్తగతం చేసుకునేందుకు చోళనాడు యువరాజు అరుణ్మోజి వర్మన్ ని చంపాలని చూస్తాడు. యువరాజును కాపాడే బాధ్యత వల్లవరాయన్(కార్తీ) తీసుకుంటారు. సముద్రంలో ప్రత్యర్ధులతో జరిగిన యుద్ధంలో అరుణ్మోజి (జయం రవి) మరణించాడని అందరు అనుకుంటారు.
అప్పుడు అరుణ్మోజి మరణానికి ప్రతీకారంగా ఆదిత్య కరికాలన్ (విక్రమ్) ఏం చేశాడు? అసలు చోళులపై నందిని(ఐశ్వర్య రాయ్) పగ ఎందుకు పెంచుకున్నారు? ఆదిత్య కరికాలుడిని చంపి, చోళనాడును ఆమె ఎందుకు నాశనం చేయాలనుకుంటుంది? అనేది మూవీ చూస్తే తెలుస్తుంది.
రివ్యూ :
పార్ట్ 2లో విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్ బచ్చన్, శోభితా దూళిపాళ కీలక పాత్రల్లో నటించారు. ప్రతి ఒక్కరు కూడా వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. ఏ పాత్ర కూడా నిరాశపరచే విధంగా ఉండదు. నందిని (ఐశ్వర్య రాయ్)- కరికాలన్ (విక్రమ్) ఎదురుపడే సీన్ సినిమాకే హైలెట్గా నిలుస్తుంది. ఎప్పటిలానే చియాన్ విక్రమ్ అయితే తన నటనతో బాగా ఆకట్టుకున్నాడు. కార్తీ, ఐశ్వర్య రాయ్ కూడా అదరగొట్టారు. దర్శకుడు మణిరత్నం ప్రతి ఫ్రేముని చాలా అందంగా తీసాడు.
ప్లస్ పాయింట్స్:
సినిమాటోగ్రఫీ
నటీనటుల పర్ఫార్మెన్స్
రెహమాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్
డైరెక్షన్
మైనస్ పాయింట్స్ :
ఎడిటింగ్
చెప్పుకోదగ్గ సీన్స్ లేవు
హడావిడిగా క్లైమాక్స్ తీర్పు
రేటింగ్: 2.75/5
ట్యాగ్ లైన్ : మీరు PS1ని ఇష్టపడితే, మీరు PS2ని ఒకసారి చూడొచ్చు. నటీనటుల పెర్ఫార్మెన్స్ కోసం మాత్రమే సినిమాని చూసే ఎంజాయ్ చేయొచ్చు.
Discussion about this post