RamaBanam Movie Review : చిత్రం : రామబాణం
నటీనటులు : గోపీచంద్, డింపుల్ హయాతి, జగపతి బాబు.
నిర్మాత : టి.జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల
డైరెక్టర్ : శ్రీవాస్
మ్యూజిక్ : మిక్కీ జే మేయర్
విడుదల తేదీ : మే 5, 2023
మాచో హీరో గా పేరు సంపాదించుకున్న యాక్షన్ హీరో గోపీచంద్ హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తున్నాడు. తాజాగా గోపిచంద్ భారీ అంచనాల నడుమ రామబాణం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్ శ్రీవాస్ కాంబోలో వస్తున్న ఈ మూవీ హ్యాట్రిక్ కొట్టిందా, లేదా అనేది చూద్దాం..
కథ:
విక్కీ (గోపీచంద్) చిన్నప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. అందుకు కారణం తన అన్న (జగపతి బాబు) తో ఉన్న గొడవలు. తర్వాత విక్కీ కోల్‌కతా లో పెద్ద డాన్ అవుతాడు. తర్వాత విక్కీ, భైరవి (డింపుల్ హయాతి) అనే యూట్యూబర్ ని ప్రేమిస్తాడు.
కార్పొరేట్ మాఫియా నేపథ్యంలో సాగే కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. తన కుటుంబాన్ని రక్షించే క్రమంలో హీరోకి ఎదురయ్యే పరిస్థితులు ఏంటి..? హీరోకి జగపతిబాబు ఎలాంటి సపోర్ట్ చేశాడు? చిన్నప్పుడే ఇంట్లో గొడవపడి వెళ్లిపోయి డాన్ గా ఎదిగిన హీరో ఆ మాఫియా అని ఎలా ఎదుర్కొన్నాడనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
రివ్యూ :
గోపీచంద్ ని ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో ఆ విధంగా చూపించారు శ్రీవాస్. కేవలం క్లాస్ ఆడియన్స్ కి మాత్రమే కాకుండా మాస్ ఆడియన్స్ కి నచ్చే విధంగా డైలాగ్స్ ఉన్నాయి. కుష్బూ, వెన్నెల కిషోర్, అలీ, సప్తగిరి, సత్య, గెటప్ శ్రీను తమ పాత్రలకి తగ్గ నటనతో మెప్పించారు.
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా సినిమాని తెరకెక్కించారు. సినిమా మొత్తం కూడా ఒక ఫ్యామిలీ డ్రామాగా సాగుతుంది. సినిమా కథ పెద్ద కొత్తగా ఏమీ అనిపించదు. కానీ సినిమా తీసిన విధానం ఎంటర్టైనింగ్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ హైలైట్ అయ్యేలా చేశారు.
ప్లస్ పాయింట్స్:
* నటీనటులు
* యాక్షన్, కామెడీ
* బీజీఎం
మైనస్ పాయింట్స్:
* కథ
* స్లో నరేషన్
రేటింగ్ : 2.75/5
ట్యాగ్ లైన్ :
యాక్షన్ సన్నివేశాలతో పూర్తి ఎంటర్టైన్మెంట్ అందించాడు డైరెక్టర్. ఇటీవల వచ్చిన ఎమోషనల్ సినిమాల్లో సినిమాగా రామబాణం సినిమా నిలుస్తుంది.