Rana Naidu Review : నటీనటులు: వెంకటేష్ దగ్గుబాటి, రానా దగ్గుబాటి, సుర్వీన్ చావ్లా, అభిషేక్ బెనర్జీ, సుశాంత్ సింగ్, ఆశిష్ విద్యార్థి, ఆదిత్య మీనన్, ముకుల్ చద్దా, రాజేష్ జైస్, రాజేష్ కుమార్, తదితరులు
దర్శకుడు : సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమాన్
నిర్మాతలు: సుందర్ ఆరోన్
సంగీత దర్శకులు: జాన్ స్టీవర్ట్ ఎదురురి
సినిమాటోగ్రఫీ: జయకృష్ణ గుమ్మడి
ఎడిటర్: ఖనోల్కర్
విక్టరీ వెంకటేష్, రానా దగ్గుపాటి కలిసి మొదటిసారిగా నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. దీంతో అబ్బాయి, బాబాయి డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. నెట్ ఫ్లిక్స్ లో ఈ రోజు స్ట్రీమింగ్ అవుతున్న రానా నాయుడు వెబ్ సిరీస్ ఎలా ఉందో ఓసారి చూద్దాం..
కథ: రానా నాయుడు (రానా దగ్గుబాటి) ముంబైలో బాలీవుడ్ సెలబ్రిటీల సమస్యలను తీర్చే ఫిక్సర్. ఎంత ఇల్లీగల్ పని అయినా ఇట్టే చేయించగల సమర్థుడు. రానా నాయుడి తండ్రి నాగా నాయుడు (వెంకటేష్) 15 సంవత్సరాలు చంచల్గూడ జైల్లో శిక్షను అనుభవించి విడుదల అవుతాడు. నాగా నాయుడికి, రానాకి అస్సలు పడదు.
రానాకి తేజ్ నాయుడు (సుశాంత్ సింగ్) అనే అన్న, జఫ్పా నాయుడు (అభిషేక్ బెనర్జీ) అనే తమ్ముడు ఉంటారు. అసలు ఈ కుటుంబంలో ఉన్న సమస్యలేంటి? నాగా నాయుడు 15 సంవత్సరాలు ఎందుకు జైల్లో ఉంటాడు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే నెట్ఫ్లిక్స్లో రానా నాయుడు చూడాల్సిందే.
విశ్లేషణ: రానా నాయుడు వెబ్ సీరిస్ 2013 లో వచ్చిన అమెరికన్ టెలివిజన్ సీరిస్ Ray Donovan కు రీమేక్ గా వచ్చింది. స్కాండిల్స్, సెకండ్ థాట్ లేకుండా పేలే గన్స్ తో,కుప్పల తెప్పలుగా ఉండే డబ్బు చుట్టూ ఈ సీరిస్ అనర్గళంగా సాగుతుంది. దాన్నే ఇండియన్ వెర్షన్ గా మార్చి చేసారు. న్యూయార్క్ కాస్తా ఇక్కడ ముంబై గా రూపొందింది.
అయితే కథగా ఇది మనకు ఇంతకు ముందు చూడనది. రెగ్యులర్ గా ఇంగ్లీష్ వెబ్ సీరిస్ లు చూసేవారికి ఇబ్బంది కాదు కానీ తెలుగులో చూద్దామనుకుని కూర్చునే వారికి రానా, వెంకటేష్ లను ఆ పాత్రలలో చూసి జీర్ణించుకోవటం కాస్త ఇబ్బంది. ఒకటి రెండు ఎపిసోడ్స్ ఓపిక్కగా చూస్తే కథలో లీనమైపోవచ్చు.
ప్లస్ పాయింట్స్:
రానా పాత్ర
వెంకటేష్ ఫెరఫార్మెన్స్
కొత్తగా అనిపించే ప్లాట్
మైనస్ లు:
స్లోనరేషన్
చాలా చోట్ల వినిపించే బూతులు
రెగ్యులర్ వ్యూయర్స్ కు డైజస్ట్ కానీ కథ
రేటింగ్ : 2.75/5
ట్యాగ్ లైన్ : పెద్దగా అంచనాలు లేకుండా ఈ వీకెండ్ ని రానా నాయుడితో ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఎమోషన్ తో కూడిన యాక్షన్ సిరీస్.
Discussion about this post