Ugram Movie Review : చిత్రం : ఉగ్రం
నటీనటులు : అల్లరి నరేష్, మిర్నా.
నిర్మాత : సాహు గారపాటి, హరీష్ పెద్ది
దర్శకత్వం : విజయ్ కనకమేడల
మ్యూజిక్ : శ్రీ చరణ్ పాకాల
విడుదల తేదీ : మే 5, 2023
తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తో అల్లరి నరేష్ అంటే ఒక బ్రాండ్ అనే ఇమేజి ని ఏర్పాటు చేసుకున్న అల్లరి నరేష్ ఈ మధ్య సీరియస్ చిత్రాలు చేస్తున్నాడు. ‘గమ్యం’, ‘శంభో శివ శంభో’, ‘మహర్షి’ , నాంది లాంటి సినిమాలు నరేష్‌కు సెపరేట్ ఇమేజ్‌ను క్రియేట్ చేయడంతో ఇటీవల మనోడు అలాంటి చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు. తాజాగా ఉగ్రం చిత్రంతో పలకరించాడు. ఈ సినిమా కథ ఏంటి, మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ:
శివ (అల్లరి నరేష్) ఒక స్ట్రిక్ట్ గా ఉండే పోలీస్ ఆఫీసర్. కొంతమంది మాదకద్రవ్యాలు తీసుకుంటూ అమ్మాయిలని ఇబ్బంది పెట్టే వారిని అరెస్ట్ చేస్తాడు. తర్వాత వాళ్లు వచ్చి శివ భార్య అయిన అపర్ణ (మిర్నా) ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. తర్వాత శివ ఆ బృందంలో ఉన్న ముగ్గురిని చంపేస్తాడు. కానీ ఒక్కరు మాత్రం మిస్ అవుతారు.
తర్వాత శివ కుటుంబానికి యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ తర్వాత శివ భార్య, కూతురు కనిపించకుండా పోతారు. అసలు వాళ్ళిద్దరూ ఏమయ్యారు? ఆ బృందంలో నాలుగవ వ్యక్తి వీళ్ళని ఏమైనా చేశాడా? అసలు అతను ఎక్కడికి వెళ్లి పోయాడు? శివ ఈ సమస్యలన్నిటినీ ఎలా పరిష్కరించాడు? తన భార్యని కూతురిని కనిపెట్టాడా? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
ఈ చిత్రంతో తన పేరు ముందు ఇక అల్లరి ఉండదని చెప్పకనే చెప్పారు నరేష్. సినిమా మొత్తానికి కర్త, కర్మ, క్రియ అన్ని తానై పోషించాడు అల్లరి నరేష్. మూవీ ఫస్ట్ ఆఫ్ చాలా నెమ్మదిగా సాగుతోంది. లవ్ ట్రాక్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక సినిమా ప్రారంభమైన 20 నిమిషాల తర్వాత నుంచి ట్రాక్ ఎక్కుతుంది. సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాల వరకు అసలు ఏం జరుగుతుందో తెలియక థియేటర్ కి వెళ్లిన జనాలు తలబద్దలు కొట్టుకుంటారు.
ఇక ఇంటర్వెల్ సన్నివేశాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. మ్యూజిక్ అనుకున్నంత మాయ చేయలేకపోయింది. సెకండ్ హాఫ్ లో మిస్టరీ, ట్విస్టులు, ప్రేక్షకులకు ఊరట కలిగిస్తాయి. సినిమాటిక్ లిబర్టీ తీసుకొని చాలా చోట్ల కొన్ని సీన్స్ పెట్టారు. అవి ప్రేక్షకులకి అసలు ఇలా జరుగుతుందా అని అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు మంచి కాన్సెప్ట్ అనిపిస్తూ ఉన్నా కూడా ప్రేక్షకులకి ఆ ఎమోషనల్ కనెక్షన్ ఎక్కడ అనిపించదు.
ప్లస్ పాయింట్స్
* నరేష్ పర్‌ఫార్మెన్స్
* ట్విస్ట్‌లు
* ఇంటర్వెల్ సీక్వెన్స్
మైనస్ పాయింట్స్:
* లవ్ స్టోరీ సీక్వెన్స్
* నెమ్మదించిన కథనం
* ఫస్టాఫ్
రేటింగ్ : 2.5/5
ట్యాగ్ లైన్..
రోటీన్ మాస్ యాక్షన్ డ్రామాలా ఉగ్రం సాగింది. యాక్షన్ సినిమాలని ఇష్టపడే వారికి ఈ మూవీ టైం పాస్ మూవీగా ఉంటుంది.