Vidudhala Movie Review : నటీనటులు : సూరి, భవాని శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఇళవరసు తదితరులు విజయ్ సేతుపతి (గెస్ట్ రోల్)
పాటలు : చైతన్య ప్రసాద్ (తెలుగులో)
సినిమాటోగ్రఫీ : ఆర్. వేల్ రాజ్
మ్యూజిక్ : ఇళయరాజా
నిర్మాత : ఎల్రెడ్ కుమార్
రచన, దర్శకత్వం : వెట్రిమారన్
తెలుగులో విడుదల : అల్లు అరవింద్ (గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్)
విడుదల తేదీ: ఏప్రిల్ 15, 2022
వెట్రిమారన్.. తమిళనాట ఈ పేరు ఓ సంచలనం. ఆయన సినిమా వస్తోందంటే చాలు.. అమాంతం అంచనాలు పెరిగిపోతుంటాయి. ఆయన ఇటీవల తమిళంలో తీసిన చిత్రం ‘విడుదలై: పార్ట్1. అక్కడ ఇప్పటికే విడుదలైన ఈ సినిమా తెలుగులో ‘విడుదల: పార్ట్1’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ కథేంటీ, ఎలా ఉందో చూద్దాం..
కథ :
తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలను ‘ప్రజా దళం’ వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకుంటుంది. ఓ ప్రాంతంలో గనుల వెలికితీతను నిరసిస్తూ బాంబుల ద్వారా రైలును పేల్చేస్తుంది. ప్రజా దళం నాయకుడు పెరుమాళ్ (విజయ్ సేతుపతి)ని పట్టుకోవడానికి ‘ఆపరేషన్ గోస్ట్ హంట్’ పేరుతో పోలీసులు ట్రై చేస్తూ ఉంటారు. అక్కడ డ్రైవర్ కుమరేశన్ (సూరి)కు పోస్టింగ్ పడుతుంది.
ఎన్ని శిక్షలు వేసినా, బాత్రూంలు కడగమన్నా కడుగుతాడు గానీ చేయని తప్పుకు ఉన్నతాధికారికి ఎందుకు క్షమాపణ చెప్పాలనే వ్యక్తిత్వం కుమరేశన్ ది. ప్రజాదళం నాయకులను పట్టుకోవడానికి పోలీసులు చేసే చర్యలు చూసి అతను ఏం చేశాడు? పాప అలియాస్ తమిళరసి (భవాని శ్రీ)తో అతని కథేంటి? చివరకు, పెరుమాళ్ దొరికాడా? లేదా? డీఎస్పీ సునీల్ మీనన్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్) పాత్ర ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
రివ్యూ :
మిగతా దర్శకులతో పోలిస్తే… వెట్రిమారన్ శైలి భిన్నమైనది. ‘విడుదల’ను కేవలం కథగానో, పోలీస్ శాఖకు వ్యతిరేకంగానో తీయలేదు. దీనిని ఒక విజువల్ పోయెట్రీగా చూపే ప్రయత్నం చేశారు వెట్రిమారన్. అందులో పూర్తిస్థాయి విజయం సాధించారు. కథగా చూస్తే.. ఒకటి, ‘విడుదల’లో కొత్తదనం లేదు. రెండు, తమిళ నేటివిటీ మరీ ఎక్కువైంది. మూడు, వెట్రిమారన్ శైలి సాగదీత ఉంది. సూరి పాత్రలో సంఘర్షణను బలంగా ఆవిష్కరించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు.
విడుదల పార్ట్ 1 చూశాక.. పార్ట్ 2 కోసం అసలు కథను వెట్రిమారన్ దాచేశారని అనిపిస్తుంది. పెద్ద నెట్వర్క్ కలిగిన ప్రజాదళం నాయకుడు అంత సులభంగా అరెస్ట్ కావడం వెనుక ఏమైనా ప్లాన్ ఉందా? అనే సందేహం కలుగుతుంది. ట్రైన్ బ్లాస్ట్ గురించి పతాక సన్నివేశాల్లో విజయ్ సేతుపతి పదేపదే చెప్పడం వెనుక కూడా పార్ట్ 2లో ఏదో చూపించబోతున్నారని అర్థం అవుతుంది. పత్రికల వార్తల్లో మరో కోణం ఉంటుందని, నిజాల్ని దాస్తారని సున్నితమైన విమర్శ చేశారు. ప్రతిదీ గుడ్డిగా నమ్మకూడదనే సందేశమూ ఇచ్చారు.
ప్లస్ పాయింట్స్ :
* స్టోరీ లైన్
* నటీనటులు
* క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ :
* సాగదీత
* కన్ ఫ్లిక్ట్స్ లేని కథ
రేటింగ్ 2.75/5
ట్యాగ్ లైన్ : వెట్రిమారన్ మార్క్ మూవీ. క్లైమాక్స్ లో విజయ్ సేతుపతి పార్ట్ 2 మీద అంచనాలు పెంచేశారు.