Vyavastha Web Series Review : నటీనటులు : హెబ్బా పటేల్, కార్తీక్ రత్నం, సంపత్ రాజ్, కామ్నా జెఠ్మలానీ తదితరులు
కథ : రాజసింహ
ఫోటోగ్రఫీ : అనిల్ బండారి
మ్యూజిక్ : నరేష్ కుమరన్
క్రియేటర్ & డైరెక్టర్ : ఆనంద్ రంగా
నిర్మాత : పట్టాభి ఆర్. చిలుకూరి
విడుదల తేదీ : ఏప్రిల్ 28, 2023
ఎపిసోడ్స్ : 8
ఓటీటీ వేదిక : జీ 5
ఓయ్ ఫేమ్ ఆనంద్ రంగ తెరకెక్కించిన ఈ వ్యవస్థ అనే వెబ్ సిరీస్ జీ 5 లో ఏప్రిల్ 28 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రంలో కార్తీక్ రత్నం, సంపత్ రాజ్, హెబ్బా పటేల్, కామ్నా జట్మలాని ప్రధాన పాత్రధారులుగా యాక్ట్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరికెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

కథ :
యామిని (హెబ్బా పటేల్), అజయ్ నూతన దంపతులు. కొత్త పెళ్లికొడుకు శోభనం గదిలోకి వెళ్లగానే తుపాకీ పేలిన శబ్దం రాగా బంధువులు, పని మనుషులు కంగారు పడి తలుపులు తెరిచి లోపలికి వెళ్తారు. రక్తపు మడుగులో ఉన్న అజయ్ మృతదేహాన్ని, యామిని చేతిలో గన్ చూసిన వాళ్లంతా షాక్ అవుతారు. సమాచారం అందిన పోలీసులు యామినిని అరెస్ట్ చేస్తారు. కేసు నుంచి బయటపడేందుకు సీనియర్ లాయర్ అవినాష్ చక్రవర్తి (సంపత్ రాజ్)ని యామిని ఫ్యామిలీ సంప్రదిస్తుంది.
అయితే, కోర్టు వాదనలో భాగంగా తన తరఫు న్యాయవాదిని మార్చుకుంటున్నానని ట్విస్ట్ ఇస్తుంది యామిని. ఆమెకు న్యాయం చేసేందుకు వంశీకృష్ణ (కార్తిక్ రత్నం) రంగంలోకి దిగుతాడు. తనను కాదన్న యామినిపై లాయర్ చక్రవర్తి ఎలా పగ తీర్చుకున్నాడు? యామినితో పాటు వంశీ కూడా ఆ కేసులో ఎందుకు ఇరుక్కున్నాడు? యామినికి అతడు న్యాయం చేశాడా? అసలు అజయ్ న్ను చంపిందెవరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే..

రివ్యూ :
సిరీస్ చాలా ఆసక్తికరంగా మొదలైంది. కానీ, ఆ ఆసక్తి నీరు గారడానికి ఎంతోసేపు పట్టదు. ఎమోషన్స్ ఏవీ వర్కవుట్ కాలేదు. ప్రతి ఎపిసోడ్ ఎండింగులో హుక్ పాయింట్, ట్విస్ట్ ఉంటుంది. అవే కాస్త ఇంట్రెస్టింగ్ టాపిక్స్!
కొన్ని కథలు పేపర్ మీద బావుంటాయ్! కానీ, స్క్రీన్ మీదకు వచ్చేసరికి అంత ఆసక్తి కలిగించవు. కథగా చూస్తే… ‘వ్యవస్థ’ బావుంటుంది! శోభనం రోజున భర్తను చంపేసిన మహిళ నిర్దోషిగా బయట పడుతుందా? జైలు శిక్ష అనుభవిస్తుందా? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్! కానీ, స్క్రీన్ మీద సీన్లు చూస్తే అంత ఉత్కంఠ, ఉత్సుకత కలిగించవు. అందుకు ప్రధాన కారణం కోర్టు రూములోని వాదనల్లో, దర్శకత్వంలో బలం లేకపోవడమే!

ఇన్వెస్టిగేషన్ డ్రామా, కోర్ట్ రూమ్ ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉండాలి? పిన్ టు పిన్… ప్రతిదీ పక్కాగా, లాజిక్కులతో ఉండాలి. స్క్రీన్ మీద సీరియస్‌నెస్ కనిపించాలి. ఏదో ముందుకు వెళుతుందంటే.. వెళుతుందన్నట్టు ఉంటుంది తప్ప ‘వ్యవస్థ’లో సరైన రైటింగ్ కనిపించదు. ఓ సోల్ మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది.
ప్లస్ పాయింట్స్:
* కార్తీక్ రత్నం, సంపత్ నంది నటన
* కోర్ట్ సీన్స్
మైనస్ పాయింట్స్:
* సాగదీత సన్నివేశాలు
* కథ
రేటింగ్: 2/5
ట్యాగ్ లైన్ : ఈజీగా స్కిప్ చేయవచ్చు. రిస్క్ చేస్తామంటారా? ఫార్వర్డ్ బటన్ ఎలాగో ఉందిగా!
