దేశ వ్యాప్తంగా ప్రజలందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. పాక్షికంగా కరోనా బారిన పడిన వారికి ఉపశమనం కలిగించే మెడిసిన్ అందుబాటులోకి వచ్చింది. కరోనా నియంత్రణ కొరకు భారత్ ఫార్మా కంపెనీ గ్లెన్ మార్క్ నోటితో తీసుకునే టాబ్లెట్ విడుదల చేసింది.
కరోనా తక్కువ మరియు మధ్యస్థాయి లక్షణాలు గల వారికి ఈ మందు వాడవచ్చు అని సంస్థ తెలిపింది. డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా అనుమతితో ఫ్యాబీ ఫ్లూ ట్యాబ్లెట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మెడిసిన్ అతి త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని సంస్థ ప్రకటించింది. 1800 mg మోతాదు కలిగిన టాబ్లెట్లు మొదటి రోజు రెండు తీసుకోవాలని, తర్వాత 14 రోజుల పాటు 200 mg మోతాదు కలిగిన టాబ్లెట్లు రోజుకు రెండు చొప్పున తీసుకోవాలని సూచించింది. టాబ్లెట్ ఖరీదు 103 రూపాయలు గా నిర్ణయించబడింది.
డాక్టర్ల పర్యవేక్షణలో ఈ మందును వినియోగించాలని, కేంద్ర ప్రభుత్వం తో కలిసి పని చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 50000 దాటి ఆందోళన కలిగిస్తున్న ఈ సమయంలో ఈ మెడిసిన్ విడుదల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. త్వరలోనే కరోనా నియంత్రణ కొరకు వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తుందని ఆశాభావం అందరిలోనూ మొదలైంది.