ఆపిల్ ఇంకా ఒక డజను ఇతర టెక్ దిగ్గజాలకు ఒక కీలక సరఫరాదారుగా ఉన్న చైనా మార్కెట్ ఇపుడు వాణిజ్య యుద్ధం కారణంగా కష్ట కాలాన్ని ఎదుర్కుంటోంది. ఆపిల్ తన సప్ప్లై చైన్ లో చాల భాగం చైనా నుండి యు.ఎస్. కి తరలించాలని యోచిస్తోంది. అంతేకాదు, చైనా ప్రపంచానికి కర్మాగారంగా ఉన్న సమయం ఇక పూర్తయిందని తెలిపింది.
ఇప్పటివరకూ ఐఫోన్ల నుండి డెల్ డెస్క్‌టాప్‌లు మరియు స్విచ్‌ల వరకు గాడ్జెట్ల ఉత్పత్తికి ప్రధాన స్థావరం చైనాలోని హన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీ కో అనే కంపెనీ. ఆ సంస్థ చైర్మన్ అయిన యంగ్ లియు గత జూన్లో 25% గా ఉన్న చైనా వెలుపల తయారీన ఇపుడు 30% వరకూ పెరిగిందని చెప్పారు.
వాణిజ్య యుద్ధం నేపథ్యంలో అమెరికా, యు.ఎస్. మార్కెట్లకు వెళ్ళే చైనా తయారు చేసిన వస్తువులపై ఎక్కువ సుంకాలని వసూలు చేస్తోంది. పెరిగిన టాక్స్ భారాన్ని తగ్గించుకోవాలంటే, ఆగ్నేయాసియా మరియు ఇతర ప్రాంతాలకు తయారీని పెంచుకోవాలని ఫాక్స్కాన్ అని కూడా పిలవబడే ఆ కంపెనీ యోచిస్తోంది. అదే కనక జరిగితే, ప్రస్తుతం 30% గా ఉన్న ఆ నిష్పత్తి మరింత పెరుగుతుంది అని లియు తన కంపెనీ ఆర్థిక ఫలితాలను నివేదించిన తరువాత విలేకరులతో అన్నారు.
ఇదిలా ఉండగా, ఇండియా లో పాపులర్ అయిన వాట్సాప్ లాంటి చాటింగ్ ఇంజిన్ అయిన వి చాట్ నుండి యు.ఎస్. నివాసితులు వ్యాపారం చేయకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు జారీ చేసారు. భారత్ తో సహా ఎన్నో దేశాలతో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా తన విధానాలను మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందేమో..
