ఈ మధ్య ఆంధ్ర పొలిటికల్ డిబేట్లలో తరుచుగా వినిపిస్తున్న విషయం – గ్రీస్ రుణ సంక్షోభం. అసలు ఏమిటీ గ్రీస్ రుణ సంక్షోభం? ఎందుకు ఏర్పడిందో సామాన్యులకు అర్థం అయ్యే భాషలో మాట్లాడుకుందాం.
గ్రీస్ మన అందరికీ తెలిసి ఒక అభివృద్ధి చెందిన దేశం, మొదటిసారిగా గ్రీస్ ఆర్థిక సంక్షోభం గురించి ప్రపంచానికి తెలిసింది 2015 లో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) కు అది 1.6 బిలియన్ పౌండ్ల చెల్లింపును చేయలేక చేతులెత్తేసినపుడు. ఒక అభివృద్ధి చెందిన దేశం అభివృద్ధి చెందిన IMFకు చెల్లింపు ఎగవేయటం అనేది చరిత్రలోనే మొదటిసారి. గ్రీస్ దేశానికీ ఆ పరిస్థితి రావటానికి కారణాలు వెతికితే, ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది – ఇది రాత్రికి రాత్రి జరగలేదు. సంక్షోభానికి ఏ ఒక్క కారణమో లేదు. మరి ఎందుకలా జరిగిందో చూద్దాం.
అసమర్థ పెన్షన్ వ్యవస్థ
పతనానికి ఇదే అతి పెద్ద కారణం. గ్రీస్ తన ఆర్ధిక ఉత్పత్తిలో (జీడీపీలో) 17.5 శాతం పెన్షన్ చెల్లింపుల కోసం ఖర్చు చేసింది,ఇది యూరోపియన్ యూనియన్ దేశాలన్నిటిలో ఎక్కువ. ఈ ప్రజాకర్షక స్కీం సంక్షోభాన్ని ఎక్కడిదాకా తీసుకొచ్చిందంటే, పెన్షన్ డబ్బులు ప్రభుత్వం చెల్లించటం మాట దేవుడెరుగు, ఆ దేశ ప్రజలు ఏటీఎంల నుండి 60 యూరోలకు మించి నగదు తీసుకోలేని పరిస్థితి వచ్చింది.
ప్రభుత్వ ఉద్యోగులకు ఆకర్షక పథకాలు
ప్రభుత్వ ఉద్యోగుల కోసం గ్రీస్‌లో ప్రభుత్వం కొన్ని ఆకర్షణీయమైన పధకాలు పెట్టింది. ఉదాహరణకు, పెళ్లికాని కుమార్తె తన చనిపోయిన తండ్రి పెన్షన్ పొందవచ్చు. కార్మికులకు సమయానికి పని చేసినందుకు బోనస్‌లను ఇస్తారు. గమనించండి – అధిక సమయం పని చేస్తే కాదు, చేయాల్సిన సమయానికి సమయానికి పని చేస్తే చాలు బోనస్ వస్తుంది. ఇంకా ఎన్నో విచిత్రమైన పేర్లు పెట్టి, గవర్నమెంట్ బోనస్ ఇచ్చింది, ఉద్యోగులు తక్కువ పని చేస్తూ ఒక్కొక్కప్పుడు అసలు పనే చేయకుండా ఉచితంగా డబ్బు అందుకునేట్లు ఈ స్కీంలు ఉపయోగపడ్డాయి.
రిటైర్మెంట్ వయసు తగ్గింపు పథకం
2013 లో, గ్రీస్ పదవీ విరమణ వయస్సును 67. అయితే ప్రభుత్వ గణాంకాల ప్రకారం, సగటు గ్రీకు పురుషుడు 63 మరియు సగటు మహిళ 59 వద్ద పదవీ విరమణ చేశారు. ప్రభుత్వ ఉచిత పధకాల వల్ల ఉద్యోగులు ముందుగానే పని విరమణ చేయటం మొదలు పెట్టారు. కీలకమైన పోలీసు మరియు సైనిక శాఖల్లో ఉద్యోగులు 40 లేదా 45 సంవత్సరాల వయస్సులోనే పదవీ విరమణ చేసేసారు.
అంతేకాదు, ప్రభుత్వం ఇక్కడ కూడా కొత్త పధకాలు పెట్టింది. ఉదాహరణకు,18 ఏళ్లలోపు పిల్లలతో ఉన్న ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకుల మహిళా ఉద్యోగులు 43 ప్రారంభంలోనే పదవీ విరమణ చేయవచ్చు. ఇక్కడ నిశితంగా చూడాల్సిన విషయం, పదవీ విరమణ చేసిన తరువాత ప్రజలు హాయిగా బతకటానికి పెన్షన్ ప్రయోజనాలు ఎటూ ఉన్నాయి.
సంతోషకరమైన నిరుద్యోగం
నిజమే మీరు కరెక్ట్ గానే చదివారు. నిజంగానే ప్రజలు నిరుద్యోగంలో హాయిగా ఉన్నారు. రెస్టారెంట్లో పని చేస్తున్న ఒక వ్యక్తిని ఒక విలేకరి ఇలా అడిగాడట – “వచ్చే నెల జీతం ఇవ్వటానికి మీ బాస్ దగ్గర డబ్బు లేదట, మరి మీ పరిస్థితి ఏమిటి?” అని. దానికి అతనిచ్చిన సమాధానం, “అయితే ఏంటి? పని లో నుండి తీసేస్తారు, అంతేగా.. నేను సాయంకాలం బీచ్ కి త్వరగా వెళతాను. ఉద్యోగం లేదు కాబట్టి నేను కరెంటు బిల్లూ ఇంకో బిల్లూ కట్టక్కర్లేదు. దానికి తోడు ప్రభుత్వం నిరుద్యోగ సహాయ పధకం కింద నాకు డబ్బు ఇస్తుంది.” అని. అప్పటికి గ్రీస్ నిరుద్యోగ శాతం 25.6%
పన్ను ఎగవేత
చివరగా మాట్లాడుకోవాల్సినది పన్ను ఎగవేత గురించి. పౌరుల నుండి, ముఖ్యంగా సంపన్నుల నుండి పన్నులు వసూలు చేయడానికి దేశం చాలా కష్టపడింది, గ్రీస్ యొక్క జాతీయ రుణం దాని జిడిపిలో 177 శాతంగా ఉండేదంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారయ్యిందో మనం అర్థం చేసుకోవచ్చు.
గ్రీస్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నపుడు ఆ దేశ ప్రధానిగా అలెక్సిస్ సిప్రాస్ ఉన్నారు, ఆయన ఆగష్టు 2015లో పదవికి రాజీనామా చేసారు.