చిలికి చిలికి గాలివానగా మారడం అంటే ఇదేనేమో. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు హిందుత్వ అజెండా మార్మోగిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాలు జరుగుతున్న భారత సంఘటనలో హిందువులమనోభావాలు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ప్రసిద్ధ దేవాలయాల్లో జరుగుతున్న వరుస సంఘటనలు ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న చర్యల పై హిందూ సంఘాలు గాని ప్రజలు దాన్ని ఏమాత్రం సంతృప్తిగా లేరని అర్థమవుతూనే ఉంది. మొదటి నుంచి కూడా ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. వారి ఆరోపణలు నిజం చేకూర్చేలా పిఠాపురం లో దేవతా విగ్రహాల ధ్వంసం, జమ్మలమడుగు, అంతర్వేదిలో స్వామి వారి రధం దగ్ధం కావడం ఆందోళన రేకెత్తించాయి.
గత సంఘటనలు మరవకముందే అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం లో రథం ఏవిధంగా దగ్ధమైందని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. టిడిపి ఇప్పటికే ఒక నీతి నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి వాస్తవాలు వెలికి తీయాలని ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. సంఘటన తర్వాత ప్రభుత్వ వర్గాలు ఇచ్చిన వివరణ మరింత గందరగోళానికి దారి తీసేలా ఉండటంతో హిందూ సంఘాల ఆందోళన బాట పట్టాయి. రథం శిఖరాగ్రం పైనున్న స్లాబ్ కు ఉన్న తేనెపట్టు ను తొలగించే క్రమంలో నిప్పు రవ్వలు ఎగసి ప్రమాదం జరిగిందని పోలీసు వారు చెబుతుండగా కుట్రపూరితంగా నే రథాన్ని దగ్ధం చేశారని భక్తులు ఆరోపిస్తున్నారు. దీనిపై స్థానిక శాసనసభ్యులు వైఖరి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వైఖరి అగ్నికి ఆజ్యం పోసినట్టు ఉండడంతో ఈ వాదం రాజకీయ రంగు పులుముకుంది.
రేపు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు అంతర్వేది పర్యటన ఉండడంతో పరిస్థితులు ఒక్కసారిగా వేడెక్కాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వరుస సంఘటనలు జరిగినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం విచారకరమని పేర్కొనడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన కొత్త రథాన్ని సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించిన కూడా ఆగ్రహం చల్లారలేదు. ఇంతలోనే స్థానికంగా ఉన్న ఒక ప్రార్థన మందిరం పై దుండగులు రాళ్లు వేయడంతో పోలీస్ శాఖ మరింతఅప్రమత్తమైంది. వైసిపి మాత్రం ప్రభుత్వం పై ప్రతిపక్షాలు కుట్రపూరితంగా వ్యవహరించి కావాలని దుష్ప్రచారం చేస్తున్నాయని వైసిపి ఆరోపిస్తోంది ఎంతటి వారైనా సరే అరెస్టు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హిందువుల మనోభావాలు విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో అని రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.