విధినిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే అధికారులను ఉపేక్షించేది లేదని ఏపీ సీఎం ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నిన్న జరిగిన అధికారుల సమావేశంలో మాట్లాడుతూ కరోనాపై నిర్లక్ష్యం వద్దని అధికారులకు స్పష్టం చేశారు. కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఉదాసీనత లేకుండా.. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కలెక్టర్లకు, జేసీ లకు స్పష్టం చేశారు. తదనంతరం స్పందన కార్యక్రమం పై మంత్రులతో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేశారు. వారం రోజుల్లో ప్రభుత్వ ఆస్పత్రిలో రెగ్యులర్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని, అడ్మిషన్ కోసం ఫోన్ చేస్తే అరగంటలో బెడ్ ఏర్పాటు చేయాలని అధికారుల పనితీరు పై కలెక్టర్ జేసీల పర్యవేక్షణ ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోన టెస్ట్ తప్పనిసరిగా చేయాలన్నారు RTPCR, ట్రూనాట్ టెస్టుల్లో ఫలితాలు 24 గంటల్లో రావాలని,రాపిడ్ టెస్ట్ ల ఫలితాలు 30 నిమిషాల్లో రావాలని స్పష్టం చేశారు.
పాజిటివ్ కేసుల్లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్లను హో మ్ క్వారంటైన్ లోనే ఉంచాలన్నారు. అదనపు సిబ్బంది నియామకాలు కొన్నిచోట్ల ఇంకా పూర్తి కాలేదని వెంటనే వాటిని చేపట్టాలని ఆదేశించారు. కరోనా చికిత్సను కలెక్టర్లు జేసీలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా, అర్బన్ హెల్త్ క్లినిక్స్ కు స్థలాల గుర్తింపును పూర్తి చేయాలని కొత్తగా 16 టీచింగ్ ఆస్పత్రులను నిర్మించబోతున్నామని వచ్చే నెలలోనే వీటికి టెండర్లు జరుగుతాయని, వీటిని కలుపుకుంటే మొత్తం25 టీచింగ్ ఆసుపత్రులు అందుబాటులోకి వస్తాయన్నారు.
ఇంకోవైపు అక్టోబర్ 5న స్కూల్స్ తెరిచే అవకాశం ఉందని, ఈనెల 30వ తేదీ లోపు నాడు-నేడు పనులు పూర్తి చేయాలని, ఆ పనుల్లో కలెక్టర్ లు జేసీ ల పర్యవేక్షణ ఉండాలని జగన్ ఆదేశించారు. ప్రీ ప్రైమరీ స్కూల్ గా మారబోతున్న అంగన్వాడి స్కూల్ లకు కొత్త భవనాలను చూడాలన్నారు. 22979 కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయని, వాటికి కొత్త భవనాలు ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున 35 షెడ్యూల్డ్ మండలాల్లో ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టాల పంపిణీ చేపడతామన్నారు. అంతేకాకుండా ఇసుక అక్రమ రవాణా అంశంపై మాట్లాడుతూ ఎవరిని ఉపేక్షించవద్దని, ఈ అంశంపై ఎస్పీలకు కలెక్టర్లకు పూర్తి స్వేచ్ఛ ఉందని, ఇప్పటికే ఇసుక అంశంపై జోక్యం చేసుకోవద్దని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఆదేశించామని, అధికారులు ఎలాంటి ఒత్తిళ్లకు లొంగవలసిన అవసరం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు
