మాటల తూటాలు వదిలే గుడివాడ శాశన సభ్యుడు రాష్ట్ర మంత్రి కొడాలి నానీ వ్యవహారశైలి అందరికీ తెలిసిందే. పార్టీలో, ఇటు ప్రభుత్వంలో కీలకమైన నేతగా ఆయన ప్రాధాన్యతపై ఎవరికీ సందేశం లేదు. టీడీపీపై ఎదురుదాడి చెయ్యడానికి కొడాలిని మించిన అస్ర్తం లేదని వైసీపీ నాయకులు భావిస్తారు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమా లాంటి అగ్రనేతల్ని తన మాటల తూటాలతో కట్టడి చేయగల సమర్థుడుగా ఆయనపై పార్టీకి ఇటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంపూర్ణ విశ్వాసం ఉంది. అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసిన ప్రసంగాలు, మీడియా సమావేశాల్లో ఆయన తన వాగ్ధాటితో ఆకట్టుకున్నారు.
ఆయన చేసే పార్టీ పరమైన విమర్శలు ఒక్కోసారి శ్రుతి మించి అసభ్య పదజాలంతో చేసినా అది పెద్దగా విమర్శలు ఎదురుకాలేదు. టీడీపీపై ఆయన వైఖరిని కుండబద్దలగొట్టినట్లు చెప్పే నానీ.. అవసమైతే వ్యక్తిగత విమర్శలు చెయ్యడానికి వెనుకాడరు. ఆయన అటువంటి విమర్శలు చేసినప్పుడు పార్టీలో టీడీపీని వ్యతికించే అన్ని వర్గాల్లో సానుకూలత వ్యక్తం కావడం విశేషం. రాజకీయాలు దిగజాతున్నాయని విమర్శలు వచ్చినప్పటికీ ఆయనకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్, ఫాలోయింగ్ ఏర్పడింది. కానీ ఒక్కోసారి ఆయన దూకుడు పార్టీకి ఇబ్బందులు తెచ్చేలా ఉందన్న వాదన కూడా బలంగా నమ్మే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.
ఇప్పటికే ఆంద్రప్రదేశ్ వ్యాప్తంగా దేవాలయాపై దాడుల విషయంలో ప్రభుత్వం ఆత్మ రక్షణ లో ఉంది. వరస సంఘటనలు జరుగుతుండటంతో ఆందోళన చెందిన ప్రభుత్వం.. ప్రముఖ దేవాలయాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ప్రతిపక్ష పార్టీలు రంగంలోకి దిగి ఆందోళనలు చెయ్యడంతో అన్ని ఘటనలపై సీబీఐ విచారణకు ఆదేశించింది. బీజేపీ, జనసేన దూకుడుగా ముందుకు వెళ్ళడంతో నష్ట నివారణ చర్యల్లో ప్రభుత్వం తనమునకలుగా ఉన్న క్రమంలో.. నిన్న నానీ చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. డిక్లరేషన్ రాజకీయ నాయకులు సృష్టించిన అంశంమే అని, ఆంతర్వేదిలో రధం దగ్ధం అయితే నష్టం లేదని కొత్తరధం నిర్మిస్తున్నామని, విజయవాడలో చోరీకి గురికాబడిన వెండి పెద్ద విలువైనది కాదని, ఆంజనేయ విగ్రహాన్ని ద్వంసం చేస్తే కొత్త విగ్రహాన్ని పెట్టిస్తామని ఆయన చేసిన కామెంట్స్ పై హిందువులు భగ్గుమంటున్నారు. మంత్రి వ్యాఖ్యలు భాధ్యతారహితంగా ఉన్నాయని షోషల్ మీడియా వేదికగా తమ నిరసన తెలియజేస్తున్నారు.
ప్రతి సందర్భంలో పార్టీని రక్షించే విధంగా వుండే నాని కామెంట్స్ ఇప్పుడు పార్టీని ఆత్మ రక్షణలోకి నెట్టాయని సొంత పార్టీవారే పెదవి విరుస్తున్నారు. సున్నితమైన విషయాల్లో ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇచ్చేలా నానీ లాంటి చరిష్మా కలిగిన లీడర్ కామెంట్ చేస్తే.. కాచుకుని కూర్చున్న వ్యతిరేక మీడియాలో అనవసర రాద్దాంతం చెయ్యడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుందని ఆందోళన చెందుతున్నారు. మొత్తం మీద నానీ కామెంట్స్ వైసీపీకి షాక్ ఇచ్చాయనే చెప్పాలి
