1 Year Of RRR : ఒక ప్రాంతీయ భాషా చిత్రం గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంది. ఒక తెలుగు సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రంగా రికార్డులకెక్కింది. ఓ దర్శకుడు కన్న కల కోసం చిత్ర బృందమంతా కలిసి కొన్ని ఏళ్లపాటు శ్రమించింది. ‘బాహుబలి’ నుంచి ఒక కళ్లు చెదిరే అద్భుతాన్ని ఆశించినవాళ్ళ నిరాశకి చోటే లేకుండా చేసాడు రాజమౌళి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మూవీతో గ్లోబల్ స్టార్లు అయిపోయారు.
స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, గోండు బెబ్బులి కొమురం భీంల ఫిక్షన్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలని విస్మయానికి గురి చేసింది. ప్రపంచం మొత్తం నాటు నాటు అంటూ స్టెప్పులేసేలా చేసింది. ఈ ఏడాది ప్రయాణంలో ఆర్ఆర్ఆర్ ఎన్నో మైలురాళ్లను దాటింది. టాలీవుడ్ కలలో కూడా ఊహించని ఆస్కార్ ను సగర్వంగా ముద్దాడింది.
ఇప్పటి వరకు RRR అందుకున్న అంతర్జాతీయ అవార్డులేంటో చూద్దాం..
* టాలీవుడ్ కు తొలిసారి ఆస్కార్ అవార్డు దక్కింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటునాటు పాటకు ఈ అత్యున్నత పురస్కారం రాగా, ఆస్కార్ వేదికపై ఎంఎం కీరవాణి, చంద్రబోస్ అందుకున్నారు.
* లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు-2022ను నాటునాటు పాట సాధించింది.
* ఇక 28వ క్రిటిక్స్ చాయిస్ అవార్డుల్లో డబుల్ ధమాకా సాధించింది. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్, బెస్ట్ సాంగ్ (నాటునాటు) కేటగిరీల్లో రెండు అవార్డులు అందుకుంది.
* బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు-2023ను నాటు నాటు పాట గెలుచుకుంది.
* హాలివుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ క్రియేటివ్స్ ఆర్ట్స్ అవార్డుల్లో.. నాలుగు అవార్డులు సాధించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (నాటు నాటు), బెస్ట్ స్టంట్స్, బెస్ట్ యాక్షన్ ఫిల్మ్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీల్లో మొదటిస్థానంలో నిలిచింది.
* హాలివుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ 2022లో స్పాట్ లైట్ విన్నర్ అవార్డును అందుకుంది.
* న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్ 2022 వేడుకల్లో బెస్ట్ డైరెక్టర్ అవార్డును రాజమౌళి అందుకున్నారు.
* శాటర్న్ అవార్డ్స్-2022లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో అవార్డు అందుకుంది.
* 88వ న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కల్ ఫిల్మ్ అవార్డ్స్ లో బెస్ట్ డైరెక్టర్ అవార్డును రాజమౌళి అందుకున్నారు.
* బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్ 2022లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు అవార్డు వచ్చింది.
* ఆస్టిన్ ఫిల్మి క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ లిస్ట్ చేసిన 2022 టాప్ 10 సినిమాల్లో 5 స్థానంలో ఆర్ఆర్ఆర్ నిలిచింది. బెస్ట్ స్టంట్ కోఆర్డినేటర్ అవార్డును నిక్ పావెల్ అందుకున్నారు.
* జార్జియా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ 2022లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు అందుకుంది.
* నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ అవార్డ్స్ 2022లో ‘టాప్ 10 ఫిల్మ్స్ ఆఫ్ ది ఇయర్’లో చోటు దక్కించుకుని అవార్డు అందుకుంది.
* అలయన్స్ ఆఫ్ ఉమెన్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అవార్డ్స్ 2022లో బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్ అవార్డు అందుకుంది.
*అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్ 2022 – ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ అవార్డు దక్కించుకుంది.
* సౌత్ ఈస్టర్న్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ లో ఉత్తమ విదేశీ భాషా చిత్రం కేటగిరీలో అవార్డు పొందింది.
* ఫిలడెల్ఫియా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్ 2022లో ఉత్తమ విదేశీ భాషా చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ సౌండ్‌ట్రాక్ అవార్డులు సాధించింది.
ఈ అవార్డులతో పాటు కొన్ని వందల కోట్ల అభిమానుల హృదయాలను గెలుచుకుంది RRR టీం. ఇంకా RRR వేట ఆగలేదు, దాని దాహం తీరలేదు. కేవలం టాలీవుడ్ చరిత్రలోనే కాదు ఇండియన్ మూవీ హిస్టరీలో RRR మూవీ చిరస్థాయిగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.