• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

19th Asian Games : 19వ ఆసియా క్రీడల్లో భారత్  శతపతకాల వెలుగులు.. 

Sandhya by Sandhya
October 7, 2023
in Latest News, Special Stories
0 0
0
19th Asian Games : 19వ ఆసియా క్రీడల్లో భారత్  శతపతకాల వెలుగులు.. 
Spread the love

19th Asian Games : నవ భారత నిర్మాణంలో క్రీడల పాత్ర ఎంతో వైవిధ్యమైనది . దేశంలో కొన్నేళ్ళనుంచి క్రీడల ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ మేర క్రీడా భారతం సుధృఢ భారతం వంటి వివిధ పధకాలు కార్యక్రమాలు రూపు దిద్దుకోవడం వల్ల క్రీడారంగపు రూపు రేఖలు మారుతున్నాయి. యువతలో జీవన నైపుణ్యాలకు ప్రోత్సాహం జాతీయ ప్రతిష్ట భావనను ప్రోది చేయడం క్రీడారంగానికి ఉత్ర్పేరకంగా మారాయి.

2014-2023 ఖేలో ఇండియా పధకం క్రింద మంజురైన 293 ప్రాజెక్టులకు గాను 146 ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయి అని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వివిధ రాష్టాలతో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ద్వారా 31 ఖేలో ఇండియా క్రీడా నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేయ బడ్డాయి. తద్వార నిర్దిష్ట క్రీడా విభాగాలపై ప్రధానంగా దృష్టి సారించి  క్రీడాకారులకు ఆత్యాధునిక శిక్షణ ఆందిస్తున్నారు. ప్రభుత్వ చొరవ పారదర్శకంగా క్రీడాకారుల ఎంపిక , శిక్షణ , మౌలిక వసతులు సదుపాయాల కల్పన వెరసి ఈ కలను సాకారం చేశాయి. 

చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఈ ఆసియా క్రీడల్లో భారత్ నుంచి మొత్తం 655 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు దేశంలోనే అతిపెద్ద దళం ఇదే. మొత్తం 40 ఈవెంట్లలో భారత ఆటగాళ్లు పాల్గొని  పతకాలు సాధించడంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. ఈసారి భారత ప్లేయర్స్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 2018 ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు 70 పతకాలు సాధించగా ఇప్పుడు నూరు పతకాలను తన ఖాతాలో వేసుకుంది. భారత ఆటగాళ్లు ఈ అద్భుతాన్ని సాకారం చేసినందుకు  యావత్ భారతవని  ప్రశంసల వర్షం కురిపిస్తోంది.   

భారత్‌ ఈ చారిత్రాత్మక మైలురాయిను సాధించడానికి కారణమైన క్రీడాకారులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తోంది. భారత్‌ ఇప్పటి వరకు 25 గోల్డ్‌, 35 సిల్వర్‌, 40 బ్రాంజ్‌ మెడల్స్‌ను సాధించారు.క్రీడాకారుల అద్భుత ప్రదర్శన విస్మయం కలిగించడమే కాకుండా, దేశ ప్రజల హృదయాలను  విశిష్ట స్దానాన్ని సంపాదించుకుంది.  2018లో ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన టోర్నీలో భారత్ 70 పతకాలు గెలుచుకోగా, అందులో 16 స్వర్ణాలు, 23 రజతాలు, 31 కాంస్య పతకాలు ఉన్నాయి. 

పతకాల వేటలో శతకం దిశగా  భారత  ప్రస్దానం సాగుతోంది . ఇది శుభ పరిణామం ఈ స్పూర్తితో రానున్న ఆంతర్జాతీయ క్రీడల్లో మరిన్ని విజయాలు సాధించగలం. “ఆటలు విస్తృతంగా బహిర్గతమవ్వాలి అన్న  2024 ఒలింపిక్స్‌కు  విశ్వక్రీడల నినాదాన్ని నిజం చేయటానికి భారతదేశం క్రీడా శక్తిగా మారే మార్గంలో ఉందని సూచిస్తుంది.  భారత క్రీడాకారులు అనేక క్రీడాంశాలలో అంతర్జాతీయ వేదికలపై  ఆత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారు.

భారత దేశాన్ని పరిగణంలోకి  తీసుకోక తప్పని క్రీడాశక్తిగా ప్రపంచం గుర్తిస్తోంది. భారత క్రీడాకారులు పతకం సాధించిన ప్రతిసారి. ప్రతి భారతీయుడు గర్వంతో ఉప్పోంగిపోతాడు. పతకం ఆందుకునే ప్రతి సందర్బంలో మన జాతీయ గీతాలాపన యావత్ దేశాన్ని సౌభ్రాత్ర బావనతో ముడివేస్తుంది. జాతి మొత్తాన్ని ఏకీకృతం చేయగల శక్తి క్రీడలకు మాత్రమే ప్రత్యేకం.


Spread the love
Tags: 19th Asian GamesIndia at the 19th Asian GamesIndia Cricket MatchesIndiya biggest railway stationInteresting Fact about  Indian PassportInteresting Fact about EuropeMost Literature Village In Asia
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.