32 Years For Jagadeka Veerudu Athiloka Sundari Movie : అదో ఆందాల అద్భుతం.. ఒక స్వర్గం తలవంచి ఇల చేరిన క్షణమది.. వైజయంతీ సినిమాల వెదజల్లిన సువర్ణిక సుగంధమది.. చెదిరిపోని స్వప్నం.. కమర్షియల్ ఫార్ములాకి ఫేంటసీ జోడీంచి అందాన్ని అభినయాన్ని అహ్యార్యాన్ని అంగీకాన్ని సమపాళ్ళలో మేళవించి సెల్యూలాయిడ్ పై పోతపోసి నవరసాలని రంగరించి తీర్చి దిదిద్దిన సినీ ప్రబంధ కావ్యమది. అమృతాల విందు అందించిన ఆ దర్శకేంద్రుని దర్శక ప్రతిభకు సాక్ష్యమది లతాలతా సరాగమాడినట్లు వరించె స్వరాలు కూర్చిన లయరజు సంగీతం మిలామిలా హిమాలే జలా జలా ముత్యాలుగాతళా తళాగళాన తటిల్లతా హారాలుగా చేతులు తాకిన కొండలకే చలనము వచ్చెటట్లు విన్సెంట్ ఫొటోగ్రఫీ మినీ సెట్స్ చేసిన సాబు సిరిల్.. వీరందరి కృషే ఇంత అద్భుతమైన విజయానికి కారణం’’ ప్రముఖ నిర్మాత సీ అశ్వినీదత్ తన సొంత బ్యానర్ వైజయంతీ మూవీస్‌పై జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రాన్ని రూపొందించారు.
అప్పట్లో ఈ చిత్రానికి బడ్జెట్ రూ.8 కోట్లు. గ్రాఫిక్స్‌కు పెద్ద పీట వేస్తూ ఆ రోజుల్లో లభ్యమైన ఉన్నత సాంకేతిక పరికరాలు ఉపయోగిస్తూ అనుభవజ్జిలైన నిపుణుల సేవలను వినియోగించుకుని తెరకెక్కించారు 09-05-1990న విడుదలైన ఈ చిత్రం నేటికి 32 వసంతాలు పూర్తి చేసుకుంది. శ్రీదేవి భూలోకానికి వచ్చినప్పుడు అందాలలో అహో మహోదయం పాట వస్తుంది. ఆ పాటను షూట్ చేయడానికి చలం గారు హిమాలయాలను అద్భుతంగా వాహిని స్డూయోస్ ఫ్లోర్ మీదికి దింపారు. అద్భుతమైన లైటింగ్‌తో విన్సెంట్ గారు హిమాలయాల్లో జరిగినట్టు చూపించారు. ఇక ఇళయరాజా గారి మ్యూజిక్ గురించి చెప్పేదేముంది.
నిజంగా దేవకన్య దిగితే ఎలా ఉంటుందో అలా వచ్చింది పాట. ఆ పాట తీయడానికి 10 రోజులు పట్టింది. ప్రజలందరూ కేరింతలు కొట్టి, విజిల్స్ వేసి, డబ్బులు వేసిన పాట ‘అబ్బనీ తీయని దెబ్బ’. ఆ పాటను కేవలం రెండు రోజుల్లోనే తీశాం. సుందరం మాస్టర్ గారు బిజీగా ఉంటే ఆ పాటను ప్రభుదేవా కంప్లీట్ చేశాడు. చిత్రంలో సోషియో ఫాంటసీతోపాటు కామెడీ, రొమాన్స్, యాక్షన్ సమపాళ్లలో కుదిరాయి. మెగాస్టార్ చిరు, శ్రీదేవి.. టైటిల్ కు తగ్గట్టుగానే తమ పాత్రలకు న్యాయం చేశారు. వేటూరి సుందర రామమూర్తి రాసిన గీతాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘అబ్బ నీ తీయని దెబ్బ’.. పాట ప్రేక్షకులను అలరించింది. మాంత్రికుడిగా అమ్రిష్ పురి నటన ప్రత్యేక ఆకర్షణ. శ్రీనివాస్ చక్త్రవర్తి జంధ్యాల యండమూరి వీరేంద్రనాధ్ త్రయం ఈ ఫ్యాంటసీ కథను రూపొందించారు ఇక ఈ సినిమలో “యమహో నీ యమ యమ అందం.. చెలరేగిందే ఎగా దిగా తాపం.!! ” అనే పాట సమయంలో చిరంజీవికి తీవ్రమైన జ్వరం ఉందట.
కానీ జ్వరం అని చెప్పి షూటింగ్ కు వెళ్లక్కపోతే.. సినిమా లేట్ అవుతుందని.. దీంతో నిర్మాత నష్ట పోకూడదన్న ఉద్దేశంతో జ్వరంలో కూడా చిరంజీవి ఈ పాటకు డ్యాన్స్ చేసారట. జగదేక వీరుడు అతిలోక సుందరి రాఘవేంద్రరావుకు ఇది 70వ సినిమా. మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి జంటగా నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం సృష్టించిన రికార్డులు టాలీవుడ్ చరిత్రలో ఓ మైలురాయిగా నిలచాయి. తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్రలో అనేక రికార్డులను క్రియేట్ చేసింది. అప్పట్లో ఈ చిత్రం వసూలు చేసిన కలెక్షన్లు దక్షిణాదిలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి.
రికార్డుస్థాయిలో 100 రోజుల పండుగ జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం రిలీజ్ సమయంలో ఎదురైన ప్రతికూల తుఫాన్ పరిస్థితులను ఎదురించి ప్రేక్షకులను థియేటర్‌కు పరుగులు పెట్టేలా చేసింది. ఈ చిత్రం 47 కేంద్రాల్లో 50 రోజులు, 29 కేంద్రాల్లో 100 రోజులు పండుగను చేసుకొన్నది. అప్పట్లో ఈ రేంజ్‌లో సినిమా ఆడటం ఓ రికార్డుగా సినీ వర్గాలు చెప్పుకొంటాయి. హైదరాబాద్‌లో సెన్సేషన్ ఇక తెలుగు సినిమా చరిత్రలో హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్ ఓ రికార్డుకు వేదికగా మారింది. ఈ చిత్రం 100 రోజులకు 30లక్షలకు పైగా రాబట్టింది.
అలాగే 162 రోజులకు ఈ చిత్రం రూ. 40 లక్షల గ్రాస్ వసూలు చేయడం నైజాం ఏరియాలో ఓ సింగిల్ థియేటర్ అత్యధికంగా వసూలు చేసిన చిత్రంగా ఓ ఘనతను సొంతం చేసుకొన్నది. నైజాంలో ఈ చిత్రం రూ.1.5 కోట్లు వసూలు చేయడం అప్పట్లో ఓ రికార్డుగా చెప్పుకొంటారు. అలాగే సీడెడ్‌లో ఈ సినిమా రూ.1.25 కోట్లు, ఆంధ్రాలో రూ.3 కోట్లు వసూలు చేసింది. ఏపీ కాకుండా కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా భారీగా కలెక్షన్లు రాబట్టింది. కర్ణాటకలో ఈ చిత్రం రూ.25 లక్షలు, మిగితా ప్రాంతాల్లో రూ.10 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా ఈ చిత్రం రూ.8 కోట్లు నికరంగా, 13 కోట్లు గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.