Airplane wings : ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి త్వరగా చేరుకోవడానికి రవాణా సాధనాల్లో మనకు ఉపయోగపడేది విమానం. కానీ విమాన ప్రయాణం అనేది అందరికీ అందుబాటులో లేదు. ఆకాశంలో విమానం వెళ్లేటప్పుడు చూసి కేరింతలు కొట్టే వాళ్ళు చాలామందే ఉంటారు. అయితే విమానం రెక్కలు వంగి ఉండటం మీరు గమనించారా..!?
అయితే విమానం యొక్క రెక్కలు ఎందుకు అలా వంగి ఉంటాయి. దాని వెనక ఏమైనా సైంటిఫిక్ కారణం ఉందా అనేది తెలుసుకుందాం. విమానం రెక్కలు చివర్లో కొద్దిగా వంగి ఉంటాయి. పక్షి ఆకారాన్ని పోలి ఉండే విమానం గాల్లో ఎగిరేటప్పుడు ఆ వంగిన రెక్కలు విమానానికి చాలా సపోర్టుగా ఉంటాయని అర్థమవుతుంది. కానీ ఆ రెక్కలు అలా వంగి ఉండడానికి అసలు కారణం ఏంటి ?
సైన్స్ లో ABC తెలిపిన వివరాల ప్రకారం, విమానం ఎగిరేటప్పుడు దాని రెక్కల పైన, కింద ఉన్న గాలి పీడనం భిన్నంగా ఉంటుంది. అలా ఉండడం వల్ల రెక్కల చివరన ఉన్న గాలి సుడిగుండాన్ని సృష్టించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు విమానం బ్యాలెన్స్ కోల్పోయి ,అత్యవసర స్థితి తలెత్తే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితి రాకుండా నిరోధించడానికి పరిశోధకులు రెండు సూచనలు చేశారు.
విమానం ఎటువంటి ప్రమాదానికి లోను కాకుండా ఆకాశంలో ఎగరాలి అంటే దాని రెక్కలు పొడవుగా ఉండాలి. విమానానికి అంత పొడవు రెక్కలు ఉంచడం చాలా కష్టతరమైన సాధ్యం కానీ పని. రెండవ సూచనగా విమానం యొక్క రెక్కలను వంచి ఉంచడం,
ఇలా చేస్తే రెక్కల నిర్మాణపు ఎగువ, దిగువ.. భాగాలలో గాలి పీడనాన్ని సమతుల్యం చేయవచ్చు. ఇలా గాలి పీడనాన్నీ సమతుల్యం చేయడం కాస్త సులభతరమైన పని కావడంతో అప్పటినుంచి రెండవ పద్ధతిని అమలు చేస్తున్నారు.