• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Special Stories

Amit Sha vs BRS : బి.అర్.యస్ తమాషాల కట్టడికై రంగంలోకి ఆమిత్ షా..

Amit Sha vs BRS

TrendAndhra by TrendAndhra
March 3, 2023
in Special Stories
0 0
0
Spread the love

Amit Sha vs BRS po A: బి.అర్.యస్ తమాషాల కట్టడికై రంగంలోకి ఆమిత్ షా..

• తెలంగాణ బిజెపి నేతలకు అమిత్ షా క్లాస్
• రాద్దాంతం.. వివాదాస్పద వాఖ్యలు వద్దు
• మీడియాలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి
• వర్గ పోరు ను ఉపేక్షించం.. గ్రూపు రాజకీయాలపై ఆగ్రహం
• స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌ ల పట్ల నేతల నిర్లక్ష్యంపై నేతలకు అక్షింతలు
• ఇంటింటికి బీజేపీని చేర్చే లక్ష్యంతో 2023 శాసనసభ ఎన్నికల ప్రధాన ఎజెండా
• మార్చి 12న రాష్ట్రానికి అమిత్ షా…

నేతలంతా గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర ముఖ్యనేతలకు దిశా నిర్దేశం చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు అనుకూల వాతావరణం ఉన్నందున సద్వినియోగం చేసుకోవాలని నేతలకు స్పష్టం చేశారు తన దృష్టి అంతా తెలంగాణ పై ఉంటుందని, తెలంగాణలో బీజేపీ గెలుపే లక్ష్యంగా నాయకులంతా ముందుకు సాగాలని, పాత, కొత్త నేతలనే తేడాలు వద్దని అభిప్రాయభేదాలు ఉంటే పరిష్కరించుకోవాలని తెలంగాణ బీజేపీలో చేరికలను ప్రోత్సహించాలని తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సూచన. పార్టీ శ్రేణులను ఎన్నికలకు తయారు చేస్తోందన్నది సుస్పష్టం. బిజెపి మిషన్ 90, ప్రజా సంగ్రామ యాత్ర, పార్లమెంటరీ ప్రవాసీ యోజన మీటింగ్‌లు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లతో జనం నుంచి వస్తున్న స్పందన, త్వరలో నిర్వహించనున్న అసెంబ్లీ నియోజకవర్గాల వారీ సభలు, అనంతరం భారీ బహిరంగ సభ వంటి కార్యాచరణ చూస్తే అధిష్టానం తెలంగాణపై దృష్టి సారించింది వచ్చే ఎన్నికలను నామమాత్రం గా కాకుండా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలి కనీసం ప్రధాన ప్రతిపక్షంగా నిలవాలి అన్నది లక్ష్యం

ప్రజాక్షేత్రంలో సంగ్రామ సంజయుడు
2014 ఎన్నికల ముందు బండి సంజయ్ ఎవరో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా అవగాహన లేదు. ఎప్పుడైతే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయి తర్వాత ఎంపీగా పోటీ చేసి గెలిచారో ఒక్కసారిగా ఆయన తెలంగాణ వ్యాప్తంగా సంచలమైనారు. విద్యార్థి దశ నుండే ఎబీవీపీ కార్యకర్తగా రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్న బండి సంజయ్ కి బలమైన ఆర్ఎస్ఎస్ నేపధ్యం కూడా కలసివచ్చింది. అంతేకాక తెలంగాణలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత . బండి సంజయ్‌కు. ముందు బాధ్యతలు నిర్వహించిన వారితో పోలిస్తే మునుపటికి, ఇప్పటికీ స్పష్టమైన తేడా కనిపిస్తుంది తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి బండి సంజయ్ చేస్తున్న ప్రయత్నాలకు ప్రధాని మోదీ స్వయంగా కితాబిచ్చారంటే న బండి సంజయ్ పని తీరుని అర్దం చేసుకోవచ్చు.

తెలంగాణలో కేసీఆర్ మార్కు రాజకీయాలతో మిగిలిన ప్రతిపక్షాలన్నీ డీలా పడిన బీజేపీ మాత్రం చురుగ్గా వ్యవహరిస్తోంది. బండి సంజయ్ ప్రజా సంగ్రాయ దుబ్బాక ఉప ఎన్నిక విజ‌యం సాధించ‌డంలో పార్టీ స‌మిష్టి కృషి.. దాంతోపాటు టీఆర్ఎస్ పార్టీపై బండి సంజ‌య్ దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌డం ఆ పార్టీ విజయానికి చాలా ప్ల‌స్ అయ్యింది. హ‌రీష్ రావు, కేటీఆర్‌, కేసీఆర్‌ల‌ను త‌న‌దైన స్టైల్లో ధీటుగా బ‌దులిస్తూ దుబ్బాక వైపు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించేలా చేయ‌డంలో బండి సంజ‌య్ సఫలీకృతులయ్యారు గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లోనూ అదే స‌త్తా చాటేలా ముందు నుంచి ప్ర‌ణాళిక‌లు ర‌చించింది. హైదరాబాద్ వ‌ర‌ద‌లు, వ‌ర‌ద సాయం అంద‌జేయ‌డంలో ప్ర‌భుత్వ విఫ‌లం, డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల పథకం, హైద‌రాబాద్ అభివృద్ధిలో టీఆర్ఎస్ ప్రభుత్వ విఫ‌లం లాంటి అంశాల‌ను ఎన్నిక‌ల్లో అస్త్రాలుగా మలుచుకొని ఎన్నిక‌ల బ‌రిలో అధికార పార్టీతో ధీటుగా పోటీప‌డ్డారు గ్రేటర్ లో గెలుపోటములు ఎలా ఉన్నప్పటికినీ కాంగ్రెస్ పార్టీని వెనక్కు నెట్టి అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అనుకునేలా జనం దృష్టిని ఆకర్షించడంలో బండ్ సంజయ్ దాదాపుగా సక్సెస్ అయ్యారు .

కరీంనగర్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్‌గా పోటీ చేసి విజయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు.2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి టీఆర్ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్పై గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలందరికంటే ఎక్కువ మెజారిటీ సాధించారు సెంటిమెంట్ ఫార్ములాని కాస్తంత పక్కకు పెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా తన శైలిని మార్చుకోవాలి ఇటీవల బండి సంజయ్ సచివాలయం గురించి చేసిన వ్యాఖ్యలను బి.అర్ యస్ కు కొంత మైలేజిని తెచ్చిపెట్టినాయి. పార్టీలోని సీనియర్లను ఇతర పార్టీ నుంచి వచ్చిన నాయకలను సమన్వయ పరచి ఈటెల సేవలను మరింత ఫలవంతమైన విగా మలచుకుంటూ చరిష్మా ఉన్న నాయకులను పార్టీలోకి తీసుకురావాలి. చర్విత చరణమైన సమస్యలు ప్రస్తావించకుండా కొత్త సమస్యలు ,ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి.

దక్షిణాదిన కర్ణాటక తర్వాత తెలంగాణలో బోణీ కొట్టాలని ఎప్పట్నుంచో బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. బీజేపీ రాష్ట్ర పగ్గాలు మరొకరికి అప్పగించి బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహానికి అడ్డుకట్ట వేయ కూడదు ఆన్న తలంఫుతో. బండి సంజయ్ కు బాధ్యతను అప్పగించింది. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో పోరు, బి.అర్ యస్ లో ఆసమ్మతి నేతలు భంగపాటు దారులు కమలం గూటికి చేరవచ్చు. చరిష్మా వున్న నాయకులకు టిక్కెట్లు దక్కవచ్చు. బీజేపీ కి ఆభ్యర్దులే లేరన్న బి,ఆర్ యస్ నాయకులు ఆమిత్ షా వ్యూహాలు అంతు చిక్కడంలేదు. జాతీయ స్దాయిలో కలిసివస్తామన్న నేతల తీరు, ఇటీవల రాజకీయ పరిణామాలు గులాబి దళ ఆధినేతను ఒక్కింత నిరుత్సాహానికి గురి చేశాయి. రానున్న కాలంలో తెలంగాణా లో రాజకీయ చిత్రం మారబోతోందన్నది సుస్పష్టం.


Spread the love
Tags: AAmit ShahBandi SanjayBjpBRSJanasenaKcrKtrNara LokeshPawanKalyanTelanganaYSJagan
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.