AP Politics : రాబోయే ఎన్నికల రేస్ లో ప్రస్తుతం ఏ పార్టీ ఎక్కడ ఉంది అంటే..?
ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి. రాజకీయ పార్టీలే కాదు.. ఆల్రెడీ జనం కూడా ఎలక్షన్ మూడ్ కి వచ్చేసారు. ప్రతీ పార్టీ కూడా రాబోయే ఎన్నికల కోసం ఆల్రెడీ కార్యక్రమాలు షురూ చేసేసాయి. ఎత్తులూ.. పై ఎత్తులూ.. పొత్తులూ.. ఇంకా ఫైనల్ కాలేదు గానీ ఎగ్జామ్ కి ముందు స్టూడెంట్స్ లా ప్రిపరేషన్ లో ఉన్నాయి. రాబోయే ఎన్నికల రేస్ లో ఇపుడు ఏ పార్టీ ఎక్కడ ఉంది అంటే..?
రేస్ లో ముందున్న వైసీపీ..!!
గత ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా 151 సీట్లు కొట్టి విజయ దుందుభి మోగించిన ఈ పార్టీ ఇపుడు Why Not 175 అంటూ అందరి కంటే ముందే ఎలక్షన్స్ కోసం రెడీ అయింది. తమ సంక్షేమ పథకాలే తమకు అండ అని నమ్ముతూ భారం మొత్తం వాటి పైనే వేసి ఎలక్షన్స్ కి రెండు సంవత్సరాల ముందు నుండే ప్రచారాన్ని స్టార్ట్ చేసింది వైసీపీ.
గత సంవత్సరం మే నెల నుండీ MLA లను ఇంటింటికీ పంపి వైసీపీ ప్రభుత్వ పథకాల ద్వారా ఎవరు ఎంత లబ్ది పొందారు అన్నది స్వయంగా MLA ల తోటే చెప్పిస్తూ ప్రచారం లో ముందుకు దూసుకు పోతుంది. ఇక అది చాలదన్నట్టు గ్రామ సారథులు అంటూ ప్రతి యాభై ఇళ్లకు ఒకరిని నియమించింది. గతంలోనే కనబడిన ప్రతి చోటా పార్టీ రంగులు వేసి విమర్శల పాలైన వైసీపీ ఇప్పుడు “మా నమ్మకం నువ్వే జగన్” అంటూ ఇంటింటికీ స్టిక్కర్లు అంటించి మరీ జనానికి జగన్ ని రుద్దే పనిలో ఉంది. ఇంత చేసినా ప్రజల్లో అసంతృప్తి సెగ తగ్గిందా అంటే లేదనే సమాధానం వస్తుంది..
ఇదేం ఖర్మ రాష్టానికి అంటూ బయలుదేరిన టీడీపీ..!!
వైసీపీ పరుగు స్టార్ట్ చేసిన ఆరు నెలల తర్వాత మేలుకుంది టీడీపీ. “ఇదేం ఖర్మ రాష్టానికి” అంటూ చంద్రబాబు రోడ్డు ఎక్కారు. మరో వైపు “యువగళం పాదయాత్ర” తో నారా లోకేష్ రాష్ట్రంలో 400 రోజుల పాదయాత్ర మొదలు పెట్టారు. అయితే ఈ యాత్రకు జనం నుండి స్పందన కరువైంది. చంద్రబాబు రోడ్ షోలు కాస్త బెటర్. నిరుత్సాహంతో ఉన్న పార్టీకి మాత్రం ఈ కార్యక్రమాలు కాస్త ఊరట. అయితే చంద్రబాబు రోడ్ షో కంటే.. లోకేష్ యాత్ర కంటే జనసేన తో పొత్తు అనే మాటే పార్టీకి కానీ కేడర్ కి గానీ ఎక్కువ ఉత్సాహాన్ని ఊపునీ ఇచ్చాయి. ఒకవేళ రేపు పొత్తు కాస్త అటూ ఇటూ అయితే మాత్రం తెలుగుదేశం పరిస్థితిని మార్చడం లోకేష్, చంద్రబాబు ల వల్ల అవదు అనేది వాస్తవం.
జనసేన ఎక్కడ..?
గత సంవత్సరం ఏప్రిల్ లోనే కౌలు రైతు భరోసా యాత్ర స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్. చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకు జనసేన పార్టీ ద్వారా ఆర్ధిక సాయం అందించారు. తర్వాత జులై లో జనవాణి అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా ఇవి రెండూ కూడా ప్రచార కార్యక్రమాలు కావు. అయితే గత దసరా నుండి జనసేనాని బస్ యాత్ర ఉంటుంది అని ప్రచారం జరిగినా కార్యరూపం దాల్చలేదు. గత నెలలో పవన్ బస్సు యాత్రకు సిద్ధం చేసిన వారాహి వెహికల్ కు పూజలు జరిగాయి కానీ యాత్ర ఎపుడు అనేది ఆ పార్టీ ఇంకా ప్రకటించలేదు. ఓ పక్క మిగితా రెండు పార్టీలు పరుగు ఆల్రెడీ మొదలు పెడితే జనసేన మాత్రం ఇంకా రేస్ లోకే ఎంటర్ కూడా అవలేదు. ఓ పక్క ప్రభుత్వ వ్యతిరేకత.. మరో పక్క నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఫెయిల్యూర్.. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన బస్సు యాత్ర కోసం జనసైనికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.
ఇదీ రాష్ట్రం లోని మూడు ప్రాధాన పార్టీల పరిస్థితి.. ప్రజల ను ఆకట్టుకోవడం లో ఎంత ముందు ఉన్నదనేది తెలీదు కానీ ప్రచారం విషయంలో మాత్రం వైసీపీ కే ఎక్కువ మార్కులు పడతాయి. కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి మరీ పార్టీ ప్రచారం చేసుకుంటుంది..!!