Beverley Gilmour : ప్రతి మనిషికి జననం, మరణం అనేది ఉంటుంది. కానీ మరణం తర్వాత ఆత్మ ఏమవుతుంది, ఎక్కడికి వెళుతుంది ఇప్పటికి ప్రశ్నార్థకమే..కానీ కొన్ని శాస్త్రాల ప్రకారం ఆత్మకు మళ్ళీ పునర్జన్మ ఉంటుందని చెప్తూ ఉంటారు. కోరికలు తీరని ఆత్మలు ప్రేతాత్మలుగా మారి ఈ ప్రకృతిలోనే సంచరిస్తూ ఉంటాయని చెప్తుంటారు.
కానీ ఇక్కడ ఒక వింత చోటు చేసుకుంది. ఒక మహిళ తను మూడుసార్లు చనిపోయి, మళ్లీ బ్రతికానని, ఆ చనిపోయిన సమయంలో కొంత మంది ఆత్మలను కలిసి మాట్లాడాలని చెప్తుంది. తాను ఎవరినైతే కలిశానని చెప్తుందో వారిలో ప్రముఖుల పేర్లు కూడా వినిపించడం గమనార్హం.
బిర్కెన్ హెడ్‌కు చెందిన బీవెర్లీ గిల్‌మర్ (57) అనే మహిళ ..తనకు 20 సంవత్సరాలు ఉన్నప్పుడు బ్రెయిన్ ట్రోమా వచ్చిందని, ఆ సమయంలో తను చనిపోయిన అనుభూతిని పొంది. గుండె కొట్టుకోవడం ఆగిపోయి శరీరం క్రమంగా పని చేయకుండా అయ్యేది అని, తన శరీరం నుండి ఆత్మ బయటకు వచ్చేది అని చెప్తూ..
మొదటిసారి ఆత్మ బయటికి వచ్చినప్పుడు తన నాన్నను కలిశానని అప్పుడు ఆయనకు 52 సంవత్సరాలు ఉన్నాయని చెప్పింది. రెండోసారి ఆత్మ బయటికి వచ్చినప్పుడు వాల్ట్ డిస్నీ కంపెనీ అధినేతను కలిశానని తెలిపింది. ఆయన తనకు ఎన్నో కథలు చెప్పే వారని, తను విన్న కథలని తను కోమాలోనుండి బయటికి వచ్చిన తర్వాత,
బుక్ రూపకంగా రాసేదాన్ని, బొమ్మలు కూడా గీసాను అని గిల్ మర్ చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్నను కలిశానని, అప్పుడు ఆయనకు 30 సంవత్సరాలు ఉన్నాయి అని తెలిపింది. ఇక చివరిసారిగా తను మరణించినప్పుడు జీసస్ ని కలిసానని తనతో స్నేహం చేశానని.. ఇలా తన జీవితం గురించి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు బీవెర్లీ బయటపెట్టింది.