Brave Girl : అనుకోకుండా తప్పిపోయి అడవిలో రాత్రంతా చిమ్మ చీకటిలో,చలిలో ఉండాల్సి వస్తే..ఆ ఊహనే భయంకరంగా ఉంటుంది కదా.. కానీ ఒక 10 సంవత్సరాల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో తన కుటుంబం నుండి తప్పిపోయి దట్టమైన అడవిలో చిక్కుకొని రాత్రంతా ఒంటరిగా గడిపింది. ఈ సంఘటన వాషింగ్టన్ లో జరిగింది. వాషింగ్టన్ లోని దట్టమైన అడవి ప్రాంతంలో భయంకరమైన మృగాలు సంచరించే అడవిలో, గడ్డకట్టుకుపోయే
చలిలో పదేళ్ల చిన్నారి 24 గంటలు ఒంటరి పోరాటం చేసింది. వేరు,వేరు కుటుంబాలకు చెందినటువంటి 20 మంది కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆదివారం రోజున ఫిష్ లేక్ రోడ్డులోని క్యాథడ్రల్ పాస్ ట్రైల్‌హెడ్ వద్ద కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారందరూ సంతోషంగా గడుపుతూ భోజనం చేయడం కోసం క్లీ ఈలమ్ నదిపై ఉన్న వంతెన వెంట నడుస్తున్నా క్రమంలో అనుకోకుండా ఓ పాపా తప్పిపోయింది.
ఆ పాపా ఆఫ్గనిస్తాన్ కి చెందిన శుంగ్లా మష్వానీ(10). వీరి కుటుంబం రెండు సంవత్సరాల క్రితమే వాషింగ్టన్ లో స్థిరపడ్డారు. శుంగ్లా అనుకోకుండా ఆ గుంపులో నుంచి వేరు కావడంతో దారి తప్పి అడవిలోకి వెళ్లిపోయింది. ఎంత వెతికినా కూడా తన తల్లిదండ్రుల జాడ ఆమెకు తెలియలేదు. మరోవైపు మిగతా అందరూ శుంగ్లా కోసం వెతకడం ప్రారంభించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ముందుగా భయపడిన శుంగ్లా తర్వాత తాను దారి తప్పిపోయినట్టు అర్థం చేసుకొని,
ఎంతో ధైర్యాన్ని, చకచక్యాన్ని ప్రదర్శించింది. తను ఎంత నడుస్తున్న ఇంకా అడవిలో లోకే వెళ్తుందనే విషయాన్ని గమనించిన శుంగ్లా కొండలు దాటుకుంటూ నది వెంట ప్రయాణించడం వల్ల ప్రయోజనం ఉంటుందేమో అని ఆలోచనలో పడింది. అనుకున్నదే తడవుగా నది వెంట నడవడం ప్రారంభించింది. రాత్రి మొత్తం ఆ అడవిలో చీకట్లో అంత చలిలో, ఎటు నుంచి ఏ క్రూర మృగము వస్తుందో తెలియని భయానక
పరిస్థితులలో ఒంటరిగా ఒక్కతే ఉండిపోయింది. రెస్క్యూటీమ్ వెంటనే రంగంలోకి దిగి శుంగ్లా కోసం వెతకడం ప్రారంభించారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శుంగ్లా ను కనిపెట్టి తల్లిదండ్రులకు అప్పగించారు. తను ఆ రాత్రంతా ఏలా గడిపింది. ఎలా ధైర్యంగా ఉంది. తనకొచ్చిన ఐడియా గురించి వివరిస్తుంటే అక్కడ ఉన్న వారందరూ చాలా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎంత చక్కటి ధైర్యాన్ని ప్రదర్శించింది అని అందరూ శుంగ్లా నీ మెచ్చుకున్నారు.
.