న్యూఢిల్లీ: మొన్నటి వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ జరిగిన నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. వానలు కేవలం రైతుల పంటలకు మాత్రమే నష్టం జరిగింది అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే, వర్షాలు వల్ల రాష్ట్రంలో పంటలతో పాటు విశాఖపట్నం, విజయవాడ సిటీ నుండి అమరావతి లాంటి చిన్న పట్టణాలు వరకూ అన్నీ తీవ్రంగా నష్టపోయాయి.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే చేసిన తర్వాత సంబంధిత అధికారులతో మీటింగ్ ఏర్పాటుచేసి జరిగిన నష్టాన్ని అంచనా వేసారు. వరదలవల్ల ఆంధ్రప్రదేశ్ కి జరిగిన నష్టం 4450 కోట్లుగా నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఈ నివేదికని కేంద్రానికి పంపించింది రాష్ట్రం. కాగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సూచనలు ప్రకారం “ప్లడ్ ఎడ్యుకేషన్” క్రింద సీనియర్ సిటిజన్స్ కి యువతకి సలహాలు ఇచ్చే ఆలోచన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కి చూచన చేసింది.
ప్రతీసారి వరదలు రావడం దాని మీద గవర్నమెంట్ నివేదికలు అంచనాలు వేయడమే ప్రజలు చూసి చూసి విసిగిపోయారు. అసలు ఈ వరదలు విషయంలో ఇప్పటివరకూ అంచనాలు వేసిన ప్రభుత్వాలే తప్ప వరదలు వచ్చినప్పుడు జనజీవనం అస్తవ్యస్తం కాకుండా ముందుజాగ్రత్తగా చేపట్టిన చర్యలు ఎక్కడైమా ఉన్నాయా అసలు?
చిన్న చిన్న వాయుగుండాల వల్ల వచ్చిన వర్షాలకి ఇలా అతలాకుతలం అయిపోతే, హుద్‌హుద్ లాంటి తుఫాన్ మరియూ వరదలు కలసి ఒకే సమయంలో వస్తే ఏంటి పరిస్థితి??
వరదలు తూఫాన్ లు ముందుగానే అంచాన వేసే సాంకేతిక వ్యవస్థ మన దగ్గర ఉందా? అంచనా వేసి జరగబోయే నష్టాన్ని నివారించేందుకు ప్రణాళికలు రచించే సామర్థ్యం ఉందా అనేది ఒకసారి ఆలోచించుకోచాలి.
అయితే ఈ విషయంలో గవర్నమెంట్ ఒక్కదాన్నే నిందించలేం. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. గవర్నమెంట్ రెస్క్యూ టీం లు, పునరావాసాలు ఏర్పాటు చేయడంలో గవర్నమెంట్ అలసత్వం ప్రదర్శించకూడదు, పునరావాసం ఏర్పాటులో ఎంతటి జాగ్రత్తలు తీసుకుంటారో అంతే జగ్రత్తలు వారికి ఆహారం అందించే విషయంలో చూపించాలి. అదే సమయంలో ప్రజలు వాళ్లకి సపోర్ట్ చేయాలి. ప్రజల నుండి సపోర్ట్ లేకపోతే గవర్నమెంట్ నుండి సపోర్ట్ జరిగే అవకాశం ఉండదు.
ప్రజలు ప్రభుత్వాలని కోరేది మాత్రం వరదలు వచ్చినప్పుడు సహాయ చర్యలు ఇవ్వడం కంటే అసలు మానవతప్పిదాలు వల్ల వరద నష్టం జరగకుండా చర్యలు తీసుకుని.. రాష్ట్ర, కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు జరగాలి అని కోరుకుంటున్నారు. ప్రభుత్వాలు ఇకమీదట అయినా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుకుందాం.