Celebrate Valentines Day – వాలెంటైన్స్ డే… ఇలా ఇంప్రెస్ చేయండి..
ఫిబ్రవరి 14, ఈరోజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు ఇష్టంగా సెలబ్రేట్ చేసుకునే రోజు ఈ రోజు..
కొత్తగా తమ ప్రేమని వ్యక్తపరచడానికి అలాగే ఇదివరకే ప్రేమలో ఉన్నవారికి ఈరోజు చాలా చాలా ప్రత్యేకం. అలాగే పెళ్లి చేసుకున్న భాగస్వామిని కూడా ఇంప్రెస్ చేయడానికి ఒక మంచి సందర్భం..
Also Read : పార్క్ లో పెళ్లిళ్లు..
కానీ నేటి రోజులు అంతా సెల్ ఫోన్ల మయం.. స్మార్ట్ యుగం.. అందుకే అందరిలా రొటీన్ గా కాకుండా కాస్త వెరైటీగా ఈరోజుని ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేస్తే బాగుంటుంది కదా…
అందుకే ఈ ఫోన్స్ అని ఇంకేదో అని కాకుండా ఓ గ్రీటింగ్ కార్డులో మీ లవర్ పట్ల కానీ భాగస్వామి పట్ల కానీ మీ అభిప్రాయాలూ.. ప్రేమని..అక్షర రూపంలో పంచుకోండి..
వీలు అయితే ఓ అందమైన గులాబీ మొక్కని బహుమతిగా ఇవ్వండి. ప్రతి రోజూ దాని కేర్ మీరే తీసుకోండి. దానికి పూచే గులాబీ ని వీలైతే మీరే ప్రతిరోజూ తనకు ప్రేమగా అందించండి. మీరు తన జీవితానికి ఎంత ముఖ్యమో అర్థమయ్యేలా తెలియజేయండి.
అలాగే మీ లవర్ ని కానీ భాగస్వామిని కానీ రెస్టారెంట్ కో .. పార్క్ కో.. వీలుంటే గనుక బీచ్ కి వెళ్లి సరదాగా వారితో వీలైనంత సేపు గడపండి.. నిజానికి చాలామంది ఈ రోజు సినిమా అనేది ఒక ఆప్షన్ లా పెట్టుకుంటారు.. వీలైనంత వరకూ అలాంటి ప్లాన్స్ పెట్టుకోకుండా ఉంటే ఆ రెండున్నర గంటల సమయం మీ ప్రియమైన వారితో పర్సొనల్ గా గడిపినవారవుతారు..
