సొంత ఊరుకి చిరంజీవి ఏం చేశారు..? కొంతమంది వేస్తున్న ప్రశ్న ఇది.. దీన్ని ప్రశ్న అనేకంటే చిరంజీవి గారి మీద చేస్తున్న దుష్ప్రచారం అనే అంటున్నారు మొగల్తూరు వాసులు. ఆయన మా ఊరికి చేసిన దానికి సాక్ష్యాలు ఇవిగో అంటూ ఫోటోలతో సమాధానం చెబుతున్నారు. ఇకనైనా చిరంజీవి గారిపై దుష్ప్రచారం ఆపండి అంటూ సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.
మొగల్తూరు వాస్తవ్యులు అందే వెంకటేశ్వర రావు, వీర నరేష్ చిరంజీవి గారిపై జరుగుతున్న దుష్ప్రచారానికి ఆవేదన చెంది తమ గ్రామానికి చిరంజీవి చేసిన అభివృద్ధి పనులు ఇవీ అంటూ కొన్ని చిత్రాలని షేర్ చేశారు. ఇవి కేవలం తమ గ్రామానికి మాత్రమే చెందినవి అనీ అదే మండల వ్యాప్తంగా అయితే ఇలాంటివి చాలా ఉంటాయి అనీ ఆయన తెలిపారు.
మొగల్తూరు లో గ్రంధాలయం
చిరంజీవి గారు చదువుకున్న హైస్కూల్ గ్రౌండ్ లో కట్టిన కళా వేదిక
మొగల్తూరు కుక్కల వారి తోట లో ఉన్న స్మశాన వాటిక కి ప్రహరీ మరియు షెడ్ నిర్మాణం కి రాజ్యసభ నిధులు 10 లక్షలు విడుదల

మొగల్తూరు గొల్లగూడెం లో కమ్యూనిటీ హల్ రాజ్యసభ నిధులతో
(ప్రస్తుతం దానిలో సచివాలయం గా వాడుతున్నారు)
మొగల్తూరులో గోదావరిపేటలో రాజ్యసభ నిధులతో కమ్యూనిటీ హాల్ (ప్రస్తుతం దీన్ని చర్చి కింద వినియోగించుకున్నారు)



ఇంకా ఇవే కాకుండా మొగల్తూరు మండలం లోని పేరుపాలెం గ్రామం దత్తత తీసుకుని 5 కోట్ల రూపాయలు తో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక రాష్ట్రం మొత్తం అయితే ఆయన చేసిన మంచిపనులు మనం లెక్కించడం చాలా కష్టం. అంతే కాకుండా కష్టం వొచ్చింది అని ఆయన దగ్గరికి వెళ్లిన వారందరికీ ఆర్ధిక సహాయలు ఎన్నో చేశారు చిరంజీవి. అన్నిటికి మించి మా ఊరికి పేరు తీసుకువచ్చారు చిరంజీవి గారు అంటూ..
ఎక్కడో కూర్చుని మొగల్తూరు కి చిరంజీవి ఏమి చేశాడు అని వాగడం కాదు ఇక్కడకు రండి నేను చూపిస్తాను మండలం మొత్తం ఆయన చేసిన అభివృద్ధి పనులు అంటూ సవాల్ విసిరారు మొగల్తూరు వాస్తవ్యులు అందే వీర వెంకటేశ్వర రావు, వీర నరేష్..
