Congress MLA Yashaswini Reddy : Background of Yashaswini Reddy రాజకీయాల్లో గెలుపు,ఓటములు సహజం. అలాగే గెలుపుకు వయసుతో సంబంధం లేదు. అది ఎవరినైనా వరిస్తుంది. ప్రశ్నించే తత్వం, అన్యాయాన్ని ఎదిరించే నైజం, ప్రజలకు మంచి చేయాలనే మానవత్వం ఉంటే రాజకీయాల్లో నెగ్గుకు రావచ్చు. ఎదురుగా ఉన్నది హేమా,హేమీలు అయినప్పటికీ చిటికలో వారిని ఓడించవచ్చు. అని రుజువు చేసింది 26 సంవత్సరాల యశస్విని రెడ్డి.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పుట్టిన యశస్విని రెడ్డి స్వగ్రామం, రేవంత్ రెడ్డి స్వగ్రామం రెండు ఒకటే. యశస్విని రెడ్డిది అంతా ఆర్థికపరమైన కుటుంబం కూడా కాదు. చాలా పేదింటి బిడ్డ. కానీ అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి ఇంటి కోడలుగా వెళ్ళిన తర్వాత యశస్విని రెడ్డి జాతకం మారిపోయిందని చెప్పవచ్చు. ఝాన్సీ రెడ్డి రెండవ కుమారునికే యశస్వి రెడ్డిని ఇచ్చి వివాహం జరిపించారు. యశస్విని రెడ్డి లో ఉండే ప్రశ్నించే తత్వం, సూటిగా మాట్లాడే తత్వం చూసిన అత్త ఝాన్సీ రెడ్డి రాజకీయాల్లోకి వెళ్తే ఈమెకు మంచి భవిష్యత్తు ఉంది అనుకుంది.
అనుకున్నట్టుగానే యశస్విని రెడ్డి ఓటమి లేనటువంటి నాయకుడైన ఎర్రబెల్లి దయాకర్ రావుని ఓడించి, వార్తలల్లోకి ఎక్కింది. ఒకరకంగా చెప్పాలంటే ఆమె ఒక చరిత్రను తిరగరాసినట్టే, తన గెలుపుతో సంచలనాన్ని సృష్టించింది. స్థానిక మీడియాలోనే కాకుండా జాతీయ మీడియాలోనూ యశస్విని గురించి ప్రస్తావించారు.
యశస్విని నేపథ్యం : ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపల్లి అనే గ్రామం ఇప్పుడు రెండు విధాలుగా చరిత్రకెక్కిందని చెప్పవచ్చు. ఒకటి ఈ గ్రామం లో పుట్టిన రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యారు. కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. ఇక ఇప్పుడు ఇదే గ్రామంలో పుట్టిన యశస్విని రెడ్డి కూడా పాలకుర్తి నియోజకవర్గంలో మకుటం లేని మహారాజుగా రాజ్యం ఏలుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించి కొత్త రికార్డు సృష్టించింది.

నిజానికి ఈ అమ్మాయి కి ఎటువంటి ఆర్థిక నేపథ్యం లేకున్నా.. తన ప్రశ్నించే స్వభావంతో ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో విజయం సాధించింది. ప్రచారంలో, అలాగే ప్రజలతో మాట్లాడేటప్పుడు తన స్పష్టమైన తెలంగాణ యాస ప్రజలకు తనను మరింత దగ్గర చేసింది. ఇవన్నీ కలిపి ఎర్రబెల్లి ఓడిపోవడానికి ఆజ్యం పోశాయి.
తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు ఓడిపోలేదు. అలాగే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా ఆయన టిడిపి నుంచి పోటీ చేసి గెలుపొందిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో వచ్చిన ఉప ఎన్నికల్లోను దయాకర్ రావు గెలిచారు. అంతటి కాకలు తీరిన యోధుడు ఎర్రబెల్లి అలాంటి వ్యక్తిని ఓడించింది అని అంటే యశస్విని రెడ్డి మామూలు విషయం కాదు అని అందరూ చాలా అందరూ మెచ్చుకున్నారు.
మరో రకంగా చూస్తే ఎర్రబెల్లి దయాకర్ రావు రాజకీయ అనుభవం 30 సంవత్సరాలు. అంటే ఆయన రాజకీయ అనుభవంతో పోలిస్తే కూడా యశశ్విని నాలుగేళ్లు చిన్నదనే చెప్పవచ్చు. తన రాజకీయ ప్రస్థానం కూడా చాలా నాటకీయా పరిమాణాలతో జరిగింది. యశస్విని రెడ్డి అత్త హనుమండ్ల ఝాన్సీ రెడ్డి పాలకుర్తి నియోజకవర్గం లో గత కొన్ని సంవత్సరాలుగా ధార్మిక కార్యక్రమాలు చేపబడుతున్నారు.
ఝాన్సీ రెడ్డి అమెరికాలో స్థిరాస్తి వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఆమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. రెండవ కోడలే యశశ్విని రెడ్డి. ఝాన్సీ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఖరారు కావడంతో అమెరికాకు సంబంధించిన పౌరసత్వం వల్ల తనకు సమస్యలు తలెత్తాయి. ఏమి చేయలేని పరిస్థితుల్లో అనివార్యంగా తన కోడలు యశస్విని రెడ్డిని ఝాన్సీ రెడ్డి తెరపైకి తీసుకువచ్చారు. ఎవరు ఊహించని విధంగా ఝాన్సీ రెడ్డి ఈరోజు విజయాన్ని కైవసం చేసుకున్నారు.
అందరూ ముందు 26 సంవత్సరాల అమ్మాయి అంత బలమైన వ్యక్తిని ఢీకొంటుంది గెలవడం అసాధ్యమని అనుకున్నారు. దానికి తోడుగా యశస్విని రెడ్డి వేదిక మీద ప్రసంగిస్తూ జై కాంగ్రెస్ అనబోయి, జై కేసీఆర్ అంది. అది విన్న కాంగ్రెస్ నేతలందరూ చాలా కంగుతిన్నారు. ఇలా తప్పులు వస్తున్నాయి, తను నిజంగా దయాకర్ రావుని ఓడిస్తుందా, అని ఒక దశలో కాంగ్రెస్ నేతలు కూడా అనుమానపడ్డారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈరోజు ఆమె విజయ పతాకాన్ని ఎగరవేసింది.
యశస్విని రెడ్డి ఎర్రబెల్లి దయాకర్ పైన విజయం సాధించిన తర్వాత ఎర్రబెల్లి దయాకర్ యశస్విని రెడ్డి మీదికి పోలీసులను కూడా పంపించాడు. తనను చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టాలని కూడా ప్రయత్నించారు. కాబట్టి అన్నింటిని ఎదుర్కొంటూ యశస్విని చాలా ధైర్యంగా నిలబడింది. తన ధైర్య సాహసాలు, ప్రశ్నించే తత్వమే తనని ఈరోజు ఇలా ప్రజల మధ్యలో ప్రజల మనిషిని నిలబెట్టిందని అంటున్నారు. ఒక పేదింటి అమ్మాయి 26 సంవత్సరాల అమ్మాయి అసెంబ్లీలో అడుగు పెట్టబోతుంది అంటే అందరూ అభినందించారు.
