చూస్తుంటే వైసీపీ టీడీపీ మరో కొత్త డ్రామా మొదలు పెట్టినట్లు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గరినుండి కరకట్ట మీద చంద్రబాబు ఇల్లు అక్రమ కట్టడమనీ కూల్చేస్తామంటూ ప్రగల్బాలు పలకడం చూస్తూనే ఉన్నాం. సంవత్సరన్నర దాటినా మాటలు తప్ప చేతలు లేని ఆ డ్రామా ఎప్పటికీ కొనసాగుతుండగా.. ఇప్పుడు కొత్తగా వైజాగ్ అక్రమ కట్టడాలు తెర మీదకు వచ్చింది. ఈ కామెడీలు చూసి జనం నవ్వుకుంటారు అని ఈ రెండు పార్టీలకు కూడా ఉండదు అనుకుంటా..
విషయం ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు అక్రమకట్టడాలు కూల్చేస్తాం అంటూ ఒక నినాదాన్ని ఎత్తుకున్నారు. దాంట్లో భాగంగా అమరావతి కరకట్ట మీద కోట్లు ఖర్చు పెట్టి అప్పటి టిడిపి ప్రభుత్వం నిర్మించిన భారీకట్టడం (పేరుకే) ప్రజా వేదికను కూల్చేసారు.
ఆ తర్వత కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నివాసం కూడా అక్రమకట్టడమే అంటూ అరచి గగ్గోలు పెట్టారు వైసిపి నేతలు. మరి ఎందుకు కూల్చలేదో ఇప్పటికీ సామాన్య ప్రజలకి అర్థం కాని విషయం.
అయితే ఇప్పుడు అక్రమ కట్టడాలు సెగ విశాఖపట్నంని తాకింది. విశాఖపట్నం లో మంచి పేరు సంపాదించి, కాలేజీ స్థాయి నుండి డీమ్డ్ యూనివర్సిటీ స్థాయికి ఎదిగిన గీతం కాలేజీ లో కట్టడాలు అక్రమంగా జరిగాయనే సమాచారం తో రెవెన్యూ అధికారులు గీతం డీమ్డ్ యూనివర్సిటీ లో జరిగిన అక్రమ కట్టడాలని కూల్చివేసే ప్రక్రియ మొదలెట్టారు.
కూల్చివేతలో భాగంగా శనవారం ఉదయం రెవిన్యూ అధికారులు యునివర్సిటీ వద్దకు చేరుకుని అక్రమంగా నిర్మించిన కాలేజీ కాంపౌండ్ వాల్ లో కొంత భాగాన్ని కూల్చివేసారు. రెవిన్యూ అధికారులు చెప్తున్న దాన్ని బట్టి గీతం యూనివర్సిటీ యాజమాన్యం దాదాపు 40 ఎకరాల వరకూ అక్రమించారు అనేది ప్రధాన ఆరోపణ. రెవిన్యూ అధికారులు ఎలాంటి ముందస్తూ సమాచారం కానీ నోటీసులు కానీ ఇవ్వకుండా ఇలా అక్రమ నిర్మాణం అంటూ కూల్చడమేంటి అంటూ యాజమాన్యం తప్పుపడుతుంది.
నిజానికి రెవిన్యూ అధికారులు గత కొన్ని నెలల క్రితం గీతం యూనివర్శిటీ పరిసరాల్లో సర్వే నిర్వహించారు, వాళ్లు చేసిన సర్వే విషయం గీతం మేనేజ్మెంట్ కి కూడా తెలుసు. అయినా రెవిన్యూ అధికారులు గీతంలో ఎలాంటి భవనాలని టచ్ చేయలేదు కేవలం అక్రమణ జరిగిన కాంపౌడ్ వాల్ మరియూ ప్లే గ్రౌండ్ లో కొంత భాగన్ని మాత్రమే స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఈ విషయంలో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. ఎందుకంటే గీతం కాలేజీ నడుపుతున్న వ్యక్తి ఎవరో కాదు టిడిపి విశాఖపట్నం ఎంపి అభ్యర్థి గా పోటి చేసి ఓడిపోయిన యమ్.భరత్ ది. పైగా భరత్ స్వయాన సినీ హీరో నందమూరి బాలకృష్ణ చిన్న అల్లుడు.
అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది, రెవిన్యూ అధికారులు నిజంగానే 40 ఎకరాలు స్వాధీనం చేసుకుంటారా? అది జరిగే పనేనా అంటే సామాన్యులు కూడా పెదవి విరుస్తున్నారు. ” హా అదంతా వాళ్ళ రాజకీయంలో ఒకభాగం జనమే ఎర్రోళ్ళు, సాయంత్రానికి బాలకృష్ణ జగన్ కి ఫోన్ చేసే ఉంటాడు” అంటూ ఎటకారాలు ఆడుతున్నారు సామాన్య ప్రజలు.
చూడాలి.. అమరావతి లో కరకట్ట మీద చంద్రబాబు అక్రమకట్టడం లాగా గీతం కూడా పేరుకే అక్రమకట్టడం అవుతుందా లేదంటే నిజంగానే ఆక్రమించిన భూమిని రెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకుంటారో.