Experts in Agriculture : ఎవరైనా విదేశాలకు ఎందుకు వెళ్తారు. ఉద్యోగాల కోసం ,లేదంటే చదువు కోసం ఎక్కువగా అమెరికా, యూరప్ కంట్రీలకు వెళ్తుంటారు కదా.. వీరితోపాటు గల్ఫ్ దేశాల వైపు కార్మికులు, సామాన్యులు జీతాల కోసం పనులు వెతుక్కుంటూ వెళ్తారు.
అయితే ఇప్పుడు ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. రైతులు కూడా ఇప్పుడు విదేశాలకు వెళ్లేందుకు ఒక మంచి అవకాశం వచ్చింది.అక్కడికి వెళ్లే రైతులకు వ్యవసాయంపై మంచి పట్టు, అవగాహన అన్ని విషయాలు తెలిసి ఆధునిక పద్ధతులపై కూడా అవగాహన కలిగి ఉండాలి.
ఈ విధానానికి శ్రీకారం చుట్టింది మాత్రం కెనడా ప్రభుత్వం. తమకు వ్యవసాయం తెలిసిన రైతులు కావాలని కెనడా ప్రభుత్వం ప్రకటించిందని టైమ్స్ నివేదిక చెబుతుంది. ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం తెలిసిన 30 వేల మందికి అవకాశం ఇవ్వనున్నట్టు, వ్యవసాయంలో మంచి నైపుణ్యం కలిగిన మహిళలు కావాలని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
దీనికి అసలైన కారణం కెనడాలో 2033 నాటికి 40 శాతం వ్యవసాయ నిర్వహకులు పదవి విరమణ చేసి అవకాశాలు ఉన్నాయంట, దాంతో అక్కడ వ్యవసాయ కూలీల కొరత ఏర్పడనుంది. కెనడా చరిత్రలోనే పెద్ద సంఖ్యలో కార్మికుల కొరత ఏర్పడుతుందని RPC తాజా అధ్యయనాల్లో వెళ్లడైంది. ఇలా జరగడం ఇదే తొలిసారి. అందుకే అక్కడి ప్రభుత్వం ఈ వినూత్న ఆలోచన చేసింది.
రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా ప్రకారం.. రాబోయే 10 సంవత్సరాలలో కార్మికుల తీవ్ర కొరత ఏర్పడనుంది అని తేలింది. ముఖ్యంగా నర్సరీలు, వ్యవసాయం, గ్రీన్‌హౌస్‌లలో 24,000 మంది కార్మికుల కొరత ఏర్పడుతుందని అంచనా. దీని ప్రభావం వ్యవసాయంపై పడనుంది. వ్యవసాయం చేసేవారు తమ తర్వాత తరం వారిని చదివించి
ఉద్యోగాలవైపే ప్రోత్సాహం కల్పిస్తుండడంతో వ్యవసాయం కుంటుపడే ధోరణి కనిపిస్తుందని, కెనడా ప్రభుత్వం ఆందోళనకు గురవుతుంది. అందుకే ప్రత్యామ్నాయంగా ఈ మార్గాన్ని ఎంచుకుంది..వ్యవసాయంలో మంచి నైపుణ్యం కలిగిన వారికి ఇదొక సువర్ణ అవకాశమని చెప్పవచ్చు.