ఓటమి వల్ల కలిగే బాధ కంటే, నమ్మిన వారు మోసం చేసారనేది ఏ మనిషినైనా మరింతగా కృంగదీస్తుంది. అలాంటి భాధను లక్షల మంది జనసేన కార్యకర్తలు చవి చూసింది రాజోలు విషయంలో..
ఆ పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక అసెంబ్లీలో తమ గొంతు వినిపిస్తాడనుకుంటే, పాల ప్యాకెట్ లు పట్టుకుని తిరుగుతూ జగన్ ఫోటోలకి అభిషేకాలు చేశారు. దాంతో ఆగ్రహంతో రగిలిన స్థానిక యువత అప్పటి నుంచీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కు చుక్కలు చూపించారు. స్థానిక ఎన్నికలు మొదలు ప్రతీ చోటా, పదవి కంటే విలువలే ముఖ్యం అనే విషయం ఎమ్మెల్యే కి తెలిసొచ్చేలా చెస్తూ వచ్చారు. కానీ అవమానం అవమానమే.. తెరవెనుక రాజకీయంతో
ఎక్కడైతే జనసేనని దెబ్బ కొట్టామని ఇన్నాళ్ళు విర్రవీగారో, అక్కడే వైసీపీకి తొలి దెబ్బ పడింది. రాష్ట్రంలో వైసీపీ నుండి తొలి వికెట్ పడింది.
తల పండిన రాజకీయ ఉద్దండులు సైతం ఆశ్చర్యపోయేలా రాజోలు వైసీపీ MLA అభ్యర్థి బొంతు రాజేశ్వర రావు జగన్ కి ఝలక్ ఇచ్చి జనసేనలో చేరబోతున్నారు. రెండుసార్లు వైసీపీ తరఫున రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన బొంతు జనసేనలో జాయిన్ అవనున్నారు అని కొన్ని ఊహాగానాలు వినిపించాయి. ఆయన ఇపుడు జనసేనాని పవన్ కళ్యాణ్ ని కలవడం తో అవి ఊహాగానాలు కాదని తేలిపోయింది. జనసేన లో ఆయన చేరిక ఇక లాంఛనమే.
మొదటి సారి 2014 లో వైసీపీ తరపున పోటీ చేసిన బొంతు రాజేశ్వర రావు టీడీపీ తరపున పోటీ చేసిన గొల్లపల్లి సూర్యారావు చేతిలో 4683 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఇదే ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి కేవలం 318 ఓట్లు పొందిన రాపాక వరప్రసాద్ 2019లో జనసేన నుండి పోటీ చేయగా ఆయన చేతిలో 814 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు.
కాగా గెలిచిన రాపాక తనను గెలిపించిన జనసేనకు వెన్నుపోటు పొడిచి అనఫీషియల్ గా వైసీపీ లో కొనసాగుతుంటే, పది సంవత్సరాలుగా పార్టీకి సేవలందించిన బొంతు రాజేశ్వరరావుకు వెన్నుపోటు పొడిచి కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేని రాపాకకు నియోజక వర్గ భాద్యతలు అప్పగించారు జగన్.
దీంతో పార్టీ వీడి రాష్ట్రంలో వైసీపీ ని ఢీ అంటే ఢీ అంటున్న జనసేన లో జాయిన్ అవబోతున్నారు బొంతు రాజేశ్వర రావు. దసరా తర్వాత పవన్ బస్సు యాత్ర చేయబోతున్నారు అప్పటినుండి జనసేనలోకి మరిన్ని చేరికలు ఉంటాయని తెలుస్తుంది.
